Site icon HashtagU Telugu

Shock to BRS: బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి పొంగులేటి?

ponguleti

Bjp

ఖమ్మం (Khammam) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యనేతలు పొంగులేటి (Ponguleti Srinivas), తుమ్మల, పువ్వాడల వ్యవహరం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటం.. ఖమ్మంపై పట్టు సాధించేందుకు ముఖ్యనేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండటం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి విరుద్ధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరం రోజున తన అనుచరులతో ‘ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేక సంకేతాలను ఇస్తూ, బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party)ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని సూచిస్తున్నాయి.

బీజేపీలో చేరే అవకాశం

మాజీ MP భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులు పోటీ చేస్తారని పొంగులేటి ప్రకటించారు. గతంలో పార్టీ తనను ఎలా సన్మానించిందో, ప్రస్తుతం పార్టీ ఎలా గౌరవిస్తోందో అందరికీ తెలుసని అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలు సీనియర్ నేత పార్టీని వీడాలని యోచిస్తున్నట్లు పలు సంకేతాలను ఇస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారని చెప్పారు. అయితే జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్‌ ఇస్తే మా పరిస్తితి ఏంటి అని? పొంగులేటితో పాటు అనుచరులు సైతం ప్రశ్నించారు. బీజేపీ ముఖ్య నేతలతో పొంగులేటి (Ponguleti Srinivas) భేటీ అయ్యారని, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి తర్వాత పార్టీ మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పొంగులేటికి భద్రత తగ్గింపు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivas) బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతమున్న 3+3 పోలీసు భద్రతను 2+2కు తగ్గించింది. దీంతో పాటు ఆయనకు ఎస్కార్ట్‌ను, ఇంటి ముందు ఉండే గన్‌మెన్‌లను కూడా తొలగించింది. ఈ విషయం ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పొంగులేటి గత కొంతకాలంగా సొంతపార్టీ అయిన బీఆర్‌ఎస్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. పొంగులేటి తీరుపై బీఆర్ఎస్ (BRS) అధిష్ఠానం గుస్సా అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన భద్రత తగ్గించడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Amazon Jobs: ఆర్థిక సంక్షోంభం.. అమెజాన్ లో 18 వేల ఉద్యోగాలు కట్!