Site icon HashtagU Telugu

Shiv Sena-Telangana Entry : తెలంగాణ ఎన్నికల బరిలో శివసేన.. పోటీ చేసేది ఆ నియోజకవర్గాల్లోనే !

Shiv Sena Telangana Entry

Shiv Sena Telangana Entry

Shiv Sena-Telangana Entry : తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ మహారాష్ట్రలోకి విస్తరణను వేగవంతం చేసిన తరుణంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

మహారాష్ట్రకు చెందిన ఏక్‌నాథ్ షిండే పక్షం శివసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది.

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (షిండే వర్గం)  పోటీ చేయనుందని తెలంగాణ శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ ప్రకటించారు.

బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని వెల్లడించారు.

Also read : Bittu Bajrangi Arrest : నూహ్ మత ఘర్షణల నిందితుడు బిట్టూ బజరంగీ అరెస్ట్

రెండు రోజుల క్రితం ముంబైలో పార్టీ సెంట్రల్ కార్యదర్శి అభిజిత్ అడ్సుల్‌తో తెలంగాణ శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ, శివసేన తెలంగాణ ప్రధాన కార్యదర్శి పసుపులేటి గోపీ కిషన్‌ సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సంబంధించి విషయాలపై చర్చ జరిగినట్టు శివాజీ తెలిపారు. మహారాష్ట్ర బార్డర్ లోని తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలపై  శివసేన ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఎంఐఎం, బీఆర్ఎస్‌లకు తమ సత్తా ఏమిటో చూపిస్తామని శివాజీ సవాల్ విసిరారు. త్వరలో హైదరాబాద్‌లో పార్టీ నిర్వహించే బహిరంగ సభలో శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఏ మాత్రం ఉండదని శివాజీ అన్నారు. తెలంగాణపై శివసేన ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుందని(Shiv Sena-Telangana Entry) చెప్పారు.

Also read : Super Mosquitoes : సూపర్ మగ దోమలు రిలీజ్ చేస్తున్నారహో.. ఆడదోమల ఖేల్ ఖతం!