ఈనాడు గ్రూపుల అధినేత , మీడియా మొఘల్ స్వర్గీయ రామోజీరావు (Ramoji Rao) కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల నివాళ్లు అర్పించారు. రీసెంట్ గా రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు.
ఈ తరుణంలో చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం 4.50 గం.కు ఆయన కన్నుమూశారు. రామోజీరావు మరణ వార్త యావత్ ప్రజానీకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రధాని మోడీ దగ్గరి నుండి అనేక రాజకీయ పార్టీల అధినేతలు, రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు తమ సంతాపాన్ని తెలియజేసారు. అలాగే కడసారి ఆయన్ను చూసేందుకు తరలివచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
రామోజీ ఫిలిం సిటీ లో స్మృతివనం లో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఇక బుధువారం రామోజీ రావుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటం వద్ద వైఎస్ షర్మిల అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు (Ramoji Rao) సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి షర్మిల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇక రెండు రోజుల క్రితం ఢిల్లీ లో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిశారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో భేటీ అయిన షర్మిల, రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ భేటీలో ఎంతో నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందని వైఎస్ షర్మిల ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ తిరిగి పునః వైభవం సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీలో కాంగ్రెస్ ఒక బలీయమైన శక్తిగా అవతరించడంలో మరిన్ని అడుగులు పడనున్నాయని పేర్కొన్నారు. ఇక రీసెంట్ గా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి చెందింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. హస్తం పార్టీ ఓడిపోవడానికి షర్మిల వైఖరే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత సుంకర పద్మశ్రీ, మరికొంత మంది నేతలు కూడా బాహాటంగానే విమర్శలు చేయడం జరిగింది. షర్మిల టికెట్లు అమ్ముకున్నారని వారు ఆరోపించారు.
Read Also : Green Coffe: ఈ గ్రీన్ కాఫీ తాగితే చాలు.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలు?