Site icon HashtagU Telugu

YS Sharmila: TSPSC కమిషన్ ను ప్రగతి భవన్ సర్వీస్ కమీషన్ గా మార్చారు : వైఎస్ షర్మిల

Sharmila Kcr

Sharmila Kcr

వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ ఆటలాడుతుందనేది నిన్న కమీషన్ ఇచ్చిన వివరణే ఒక నిదర్శనం. గ్రూప్ 1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్కట. ఓఎంఆర్ షీట్స్ లెక్కిస్తే మరో లెక్కట. ఇది చాలా కామన్ అట. అర్హత లేనోళ్లకు, దొర అడుగులకు మడుగులు ఒత్తేటోళ్లకు పదవులు కట్టబెడితే కామన్ కాక మరేంటి? అని షర్మిల ప్రశ్నించారు.

‘‘ఇప్పటిదాకా ఏ సర్కారు పరీక్షలే పెట్టనట్లు.. ఎవరూ ఉద్యోగాలే ఇవ్వనట్లు కమీషన్ కాకమ్మ కథలు చెబుతున్నది. ప్రశ్నాపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓఎంఆర్ షీట్స్ తారుమారుచేయడం ఒక లెక్కనా? ఆమె ప్రశ్నించారు. ‘‘నిజంగా బోర్డు పారదర్శకత పాటిస్తే పేపర్లు బయటకు ఎందుకు వచ్చినట్లు? ఓసారి పరీక్ష రద్దైన తర్వాత మరోసారి ఎందుకు జాగ్రత్తలు తీసుకోనట్లు? బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే కమీషన్ కి వచ్చిన నష్టం ఏంటి? అన్యాయం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కితే,పెట్టిన పరీక్షలే న్యాయస్థానం రద్దు చేసిందంటే.. TSPSC పారదర్శకత ఏంటో  అర్థమైంది’’ అంటూ షర్మిల సెటైర్స్ వేశారు.

‘‘రెండు సార్లు పరీక్షలు రాసినా ఫలితం లేకపాయెనే అని కనీళ్లు పెట్టుకుంటున్న 2.33 లక్షల నిరుద్యోగుల గోస ఈ సర్కారుకు తగలకపోదు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను కాస్త.. దొరలు ప్రగతి భవన్ సర్వీస్ కమీషన్ గా మార్చారు. నచ్చినోళ్లకు పదవులు, కావాల్సినోళ్లకు ఉద్యోగాలు ఇదే దొర తెచ్చిన బంగారు తెలంగాణ’’ అంటూ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యింది షర్మిల.

Also Read: BRS Minister: నాడు తండ్లాట‌.. నేడు తండాలు అభివృద్ధి బాట‌: మంత్రి ఎర్రబెల్లి