Site icon HashtagU Telugu

Telangana Politics: ఢిల్లీ నుంచి ఇన్విటేషన్.. గల్లీలో కొట్లాట

Telangana Politics

New Web Story Copy 2023 05 24t145457.171

Telangana Politics: ఓ వైపు ఢిల్లీ నుంచి పిలుపు, మరోవైపు గల్లీలో కొట్లాట. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు పావులు కదుపుతుంది. విపక్షాలను మూటగట్టుకుని కేసీఆర్ పై పోరాటానికి సిద్ధమవుతుంది. ఇటీవల కర్ణాటక ఎన్నిక ఫలితాలతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణపై ఫోకస్ చేసింది. తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలే రిపీట్ కానున్నట్టు తెగ ప్రచారం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో గంటపాటు ఫోన్ లో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్టీపి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనీ కోరినట్టు ప్రచారం జరిగింది.

ఓ వైపు ఢిల్లీ హైకమాండ్ షర్మిలతో సంప్రదింపులు జరుపుతుంటే తెలంగాణాలో కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీల మధ్య వార్ నడుస్తుంది. అవును ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిలకు మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. నాది ఆంధ్ర అయితే మరి సోనియా గాంధీది ఎక్కడ అంటూ ఘాటుగా ప్రశ్నించారు షర్మిల. నేను ఆంధ్ర నుంచి వస్తే సోనియమ్మ ఇటలీ నుంచి రాలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. నా వల్ల రేవంత్ రెడ్డి అభద్రతాభావంతో ఉన్నారని, తన ఉనికిని ఎక్కడ కోల్పోతానో అని భయపడుతున్నాడని ఆరోపించారు షర్మిల. ఒక మహిళ వివాహం తరువాత పుట్టింటిని వదిలేసి, పిల్లల కోసం తన ఊరును కాదని, ఎక్కడికో వెళ్లి బ్రతుకుతుందని, ఇది మన దేశ సంస్కృతి, సంప్రదాయమని గుర్తు చేశారు వైఎస్ షర్మిల. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను అర్ధం చేసుకోవాలి అంటే సంస్కారం ఉండాలని చురకలంటించారమే.

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తెలంగాణ పేరు ఎత్తే అర్హత కూడా లేదని చెప్పారు షర్మిల. తెలంగాణాలో ప్రాంతీయ పార్టీ అంటే ఒక్క వైఎస్ఆర్టీపి మాత్రమేనని, తెలంగాణ ప్రజల గురించి పోరాటం చేసేదే మా పార్టీనే అంటూ స్పష్టం చేశారు షర్మిల. అయినా నా ప్రాంతాన్ని ఎత్తి చూపే ముందు రేవంత్ రెడ్డి అల్లుడిది ఆంధ్ర కాదా అంటూ మండిపడ్డారామె. ఇదిలా వచ్చే ఎన్నికల సమయానికి తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కలిసిపోతారని జోస్యం చెప్పారు షర్మిల.

Read More: Sengol History : ‘సెంగోల్’ రాజదండం.. థ్రిల్లింగ్ హిస్టరీ

Exit mobile version