Site icon HashtagU Telugu

Telangana Politics: కేసీఆర్ కుటుంబానికి 4 హెలికాప్టర్లు ఎక్కడివి?

Telangana (11)

Telangana (11)

Telangana Politics: తెలంగాణాలో ఎన్నికల వాతావరణం మొదలైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ భవిష్యత్తును తేల్చుకోనున్నాయి. అయితే అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తుంది.ఇప్పటికే సీఎం కేసీఆర్ తమ అభ్యర్థుల్ని ప్రకటించారు. తొలి జాబితాలో 115 మంది అభ్యర్థుల్ని ఆయన నెల క్రితమే ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించనుంది. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలు వెలువెత్తున్నాయి. కల్వకుంట్ల కుటుంబంపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత అన్నారు.

గత అసీంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్, కవిత నాలుగు హెలికాప్టర్లను వినియోగించారని, ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని షబ్బీర్‌ అలీ తెలిపారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ 4 హెలికాప్టర్లు ఎవరి డబ్బుతో నడుపుతున్నారో ఎన్నికల సంఘం గుర్తించాలని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. బీఆర్‌ఎస్‌ సమావేశాలకు జనం రావడం లేదని, డబ్బులు చెల్లించి బలవంతంగా సమావేశాలకు తీసుకొచ్చారన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో ఇంకా ఎవరికీ టికెట్ ఖరారు చేయలేదని, టికెట్ ఖరారు చేయకుండా టికెట్ ఎలా అమ్ముకుంటామని షబ్బీర్ అలీ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ రాజకీయ జీవితాన్ని ప్రసాదించిందని షబ్బీర్ అలీ అన్నారు . కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడి ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఆందోళన లేకుండా ప్రజలను అణిచివేస్తోందని దుయ్యబట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ.

Also Read: Chandrababu – Monday Verdicts : చంద్రబాబుకు సోమవారం కీలకం.. అన్ని కేసుల్లో తీర్పులు రేపే ?

Exit mobile version