Asifabad Violence: ఆసిఫాబాద్ హింసాత్మకంగా మారుతుంది. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో 2000 మంది గుంపు ముస్లిం వ్యక్తిపై దాడి చేయడంతో ఉద్రిక్తత చెలరేగింది. జిల్లాలో ఓ గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు నిందుతుడిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు 200 మందికి పైగా ఈ దాడిలో పాల్గొనడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.
Asifabad Violence
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ముస్లిం వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ గత వారం గిరిజన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.ఈ ఘటనకు నిరసనగా బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. 2000 మంది గుంపు ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లోని ముస్లిం వ్యక్తి ఆస్తులపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో పలు దుకాణాలకు నిప్పు అంటించారు. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. సమాచారం అందుకున్న ఆసిఫాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో నిరసనకారులు ఆ ప్రాంతంలో మోహరించడంతో స్థానిక పోలీసులకు సహాయం చేయడానికి పొరుగు మండలాలు మరియు ప్రధాన కార్యాలయాల నుండి బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆసిఫాబాద్ మరియు రాష్ట్రంలోని సీనియర్ పోలీసు అధికారులు హింసాత్మక ప్రాంతాలకు వెళుతున్నారు.
ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఘటనపై స్పందించాడు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ అనుమతించవద్దని అన్నారు. తెలంగాణ డిజిపితో మాట్లాడానని తెలిపారు. అదనపు బలగాలను పంపిస్తున్నామని, నిరసనకారులపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ డిజిపి హామీ ఇచ్చినట్లు ఒవైసి పేర్కొన్నారు. కాగా దేశంలో మైనారిటీలపై జరుగుతున్న హింసపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించడం తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో ముస్లిం వృద్ధుడిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.