ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు (Kalvakuntla Himanshu) ఒకవైపు చదువుతూనే, మరోవైపు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విద్యార్ది దశలోనే పలు కార్యక్రమాలు నిర్వహించాడు. తోటి విద్యార్థులు, స్కూ టీచర్స్ సాయంలో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేస్తూ, అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా హిమాన్షు మీడియాతో మాట్లాడారు.
తాతగారు (కేసీఆర్) నుంచి పొందిన స్ఫూర్తితోనే తాను సేవా, దాతృత్వానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. హిమాన్షు సేవా కార్యక్రమాలలో భాగంగా స్థానిక పాఠశాలలను దత్తత తీసుకోవడం జరిగింది. ఊహించనిరీతిలో స్కూల్ ను డెవలప్ చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా, హిమాన్షు తన తల్లితో కలిసి పూజ్యమైన పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్‌ఎస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. తన తండ్రి కేటీఆర్‌తో పోలికల గురించి అడిగినప్పుడు, హిమాన్షు వాటిని కొట్టిపారేశారు. తన తండ్రి అసాధారణమైన పనితీరును, ప్రజా సేవకు అంకితమైన నాయకత్వ లక్షణాలను ప్రశంసించాడు. తన తండ్రి నిబద్ధత స్థాయికి సరిపోలడం సరికాదన్నాడు. అయితే హిమాన్షు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రశంసిస్తుండగా, మరో వర్గం ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం.
Also Read: Hyderabad: మానవత్వానికే మచ్చ.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కన్నబిడ్డనే చంపిన తల్లి