Site icon HashtagU Telugu

D. Srinivas: డి. శ్రీనివాస్ కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!

Ds

Ds

ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌ (D. Srinivas)కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే డీఎస్‌ (D. Srinivas) కు ఫిట్స్ రావడంతో హుటాహుటిన సిటీ న్యూరో ఆసుపత్రి (Hospital)కి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని కాబట్టి రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని ట్విటర్ వేదికగా తన కార్యకర్తలకు తెలిపారు.

నేడు రేపు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ‘‘మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు’’ అని అరవింద్ (Arvind) ట్వీట్ చేశారు. అయితే డీఎస్ (D. Srinivas) ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: Princess Esra: యాదాద్రికి నిజాం రాణి విరాళం.. 5 లక్షల బంగారం అందజేత

Exit mobile version