MLA Seethakka : అసెంబ్లీ నియోజకవర్గాలలో డెవలప్మెంట్ వర్క్స్ కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్)ను రాష్ట్ర సర్కారు మంజూరు చేస్తుంటుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినందునే తన నియోజకవర్గానికి (ములుగు) నిధులను మంజూరు చేయడం లేదంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. సీడీఎఫ్ నిధుల మంజూరులో జిల్లా మంత్రి ప్రమేయం చట్ట విరుద్ధమని ఈ పిటిషన్ లో సీతక్క ఆరోపించారు.
Also read : I Am With Babu: రేపు జగన్ ప్యాలెస్ దద్దరిల్లిపోయేలా ‘మోత మోగిద్దాం’
మంత్రి ఆమోదంతో నిధులు మంజూరు చేయాలన్న జీవో 12 ను కొట్టివేయాలని సీతక్క తన పిటిషన్ లో కోర్టును కోరారు. ఈ జీవోను కొట్టేసి.. ములుగు నియోజకవర్గానికి వెంటనే నిధులను విడుదల చేయాలని ఆదేశించాలని సీతక్క తరపున న్యాయవాది కృష్ణకుమార్ గౌడ్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన హైకోర్టు .. కౌంటర్లు దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి (MLA Seethakka) వాయిదా వేసింది.