Gandhi Hospital: కడుపులో షేవింగ్ బ్లేడ్ ముక్కలు.. ఆపరేషన్ లేకుండా రోగిని కాపాడిన గాంధీ వైద్యులు

Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన ఘనత సాధించారు. కుటుంబ సమస్యల కారణంగా క్షణిక ఆవేశానికి లోనైన ఓ వ్యక్తి 8 షేవింగ్ బ్లేడ్లను ముక్కలుగా చేసి మింగిన ఘటనలో, శస్త్రచికిత్స లేకుండా వైద్యులు ఆయన ప్రాణాలను రక్షించారు.

Published By: HashtagU Telugu Desk
Gandhi Hospital

Gandhi Hospital

Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన ఘనత సాధించారు. కుటుంబ సమస్యల కారణంగా క్షణిక ఆవేశానికి లోనైన ఓ వ్యక్తి 8 షేవింగ్ బ్లేడ్లను ముక్కలుగా చేసి మింగిన ఘటనలో, శస్త్రచికిత్స లేకుండా వైద్యులు ఆయన ప్రాణాలను రక్షించారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసులో, వైద్యులు మూడు రోజుల్లోనే కడుపులోని 16 పదునైన బ్లేడ్ ముక్కలను సురక్షితంగా బయటకు రప్పించడంలో విజయం సాధించారు. మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసమున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ ఖాజా (37)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16న కుటుంబంలో జరిగిన గొడవ కారణంగా తీవ్ర ఆవేశంలో అతను 8 షేవింగ్ బ్లేడ్లను ముక్కలుగా చేసి మింగాడు. కొద్ది సమయానికే అతనికి తీవ్రమైన కడుపు నొప్పి ఏర్పడి, మరణించే భయం వ్యక్తం అయ్యింది. కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనై వెంటనే ఖాజాను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Cloud Burst : ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్

జనరల్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సునీల్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే స్పందించి ఎక్స్‌రే, సీటీ స్కాన్ ద్వారా ఖాజా కడుపులో బ్లేడ్ ముక్కలు ఉన్నట్టు నిర్ధారించారు. మొదట ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగించాలని ప్రయత్నించినా, ఆ ప్రక్రియలో అన్నవాహిక, ఇతర అవయవాలకు గాయాలు, రక్తస్రావం జరగే ప్రమాదం ఉందని గుర్తించారు. కాబట్టి, శస్త్రచికిత్సకు బదులు ప్రత్యామ్నాయ మార్గంలో చికిత్స అందించాలని నిర్ణయించారు. వైద్యులు ‘ప్రోటాన్ పంప్’ అనే ప్రత్యేక వైద్య ప్రక్రియను ఎంచుకుని ఖాజాకు ఆహారం, నీరు నిలిపి, ఇంట్రావీనస్ (ఐవీ) ద్వారా ద్రవాలను అందించారు.

ఈ విధానం ద్వారా బ్లేడ్ ముక్కలు నెమ్మదిగా కదులుతూ మల విసర్జన ద్వారా బయటకు వచ్చాయి. మూడు రోజుల పాటు కొనసాగిన చికిత్సలో, కడుపులోని అన్ని బ్లేడ్ ముక్కలు సురక్షితంగా బయటకు వచ్చాయి. అనంతరం మరోసారి ఎక్స్‌రే ద్వారా పరిశీలించి, కడుపులో ఎలాంటి ముక్కలు లేవని ధృవీకరించగా వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడు పూర్తిగా కోలుకొని ఈ నెల 21న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి అడిషనల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న రోగి ప్రాణాలను శస్త్రచికిత్స లేకుండా రక్షించిన గాంధీ ఆసుపత్రి వైద్య బృందానికి ప్రజలు, నిపుణులు విస్తృతంగా అభినందనలు తెలిపారు.

Tiktok : భారత్లోకి మళ్లీ టిక్క్.. కేంద్రం క్లారిటీ

  Last Updated: 23 Aug 2025, 11:02 AM IST