Site icon HashtagU Telugu

BRS MLAs Secret Meeting: ఎమ్మెల్యేల రహస్య భేటీ.. బీఆర్ఎస్ లో హైడ్రామా

brs mlas secret meeting mallareddy

Mallareddy

తెలంగాణ (Telangana) రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే టీకాంగ్రెస్ లో సీనియర్స్ వర్సెస్ రేవంత్ వ్యవహరం  చర్చనీయాంశమవుతుండగా, తాజాగా మరో పార్టీలో రహస్య భేటీ తీవ్ర కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి నివాసంలో అరికపూడి గాంధీ, వివేక్, మాధవరం కృష్ణారావు, బి.సుభాష్ రెడ్డి (BRS MLAs Secret Meeting) తదితరులు రహస్యంగా సమావేశం అయ్యారు. రెండు గంటలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం కొనసాగుతోంది. అయితే ఎమ్మెల్యే మైనంపల్లి మాత్రం ఇదొక సాధారణ సమావేశమని.. దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పేర్కొన్నారు.

అయితే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా జిల్లా శాశన సభ్యుల సమావేశం జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మార్పుపై ఈ భేటి కొనసాగుతోందని సమాచారం. ఇప్పటి వరకూ కుత్బుల్లాపూర్‌కి చెందిన రవి యాదవ్‌ను తప్పించి మేడ్చల్‌కు చెందిన భాస్కర్ యాదవ్‌ను నియమించడంతో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో మంత్రి మల్లారెడ్డికి మధ్య గ్యాప్ ఉంది. మంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా మంత్రి మల్లారెడ్డి  (Mallareddy) తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఇవాళ మైనంపల్లి హన్మంతరావు నివాసంలో భేటీ అయ్యారు.

మైనంపల్లి హన్మంతరావు నివాసంలో భేటీ అయిన ఎమ్మెల్యేలకు (BRS MLAs Secret Meeting) సీఎం కార్యాలయం నుండి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం అందుబాటులో ఉండాలని సీఎం కార్యాలయం నుండి సమాచారం అందినట్టు సమాచారం. కాగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశమయ్యారో తనకు తెలియదని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి చెప్పారు. సోమవారం ఉదయం మంత్రి మల్లారెడ్డి గద్వాల జోగులాంబ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. తన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు (BRS MLAs Secret Meeting) సమావేశమైన విషయం గురించి హైద్రాబాద్ కు వెళ్లిన తర్వాత తెలుసుకుంటానని మల్లారెడ్డి తెలిపారు.

Also Read: BJP Target Congress: ‘కాంగ్రెస్ వార్’ పై బీజేపీ గురి.. అసంతృప్తులకు ఆహ్వానం!