Secret Manifesto : కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే..?

క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత దూకుడు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను (Secret Manifesto) రూప‌క‌ల్ప‌న చేసింది.

  • Written By:
  • Publish Date - July 8, 2023 / 05:09 PM IST

క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత దూకుడు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను (Secret Manifesto) రూప‌క‌ల్ప‌న చేసింది. స‌రిగ్గా కేసీఆర్ మైనస్ పాయింట్ల మీద మేనిఫెస్టో సిద్ద‌మ‌యింది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా సామాన్యుల‌ను ఆక‌ట్టుకునేలా రూపొందించార‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల్లోని టాక్‌. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గతి, మ‌హిళ‌ల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. సేమ్ టూ సేమ్ ఏపీ టీడీపీ మేనిఫెస్టోలోని 80శాతం ప‌థ‌కాల‌ను తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోల ఉండ‌బోతుంద‌ని బీఆర్ఎస్ అనుమానిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను (Secret Manifesto)

కేసీఆర్ ‘ఎత్తుగడలకు ఎలా చెక్ పెట్టవచ్చు.?’ అనే కోణంలో తీవ్రంగా కసరత్తులు మొదలు పెట్టారు. వాటికి త‌గిన అస్త్రాల‌ను త‌యారు చేశారు కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్లు. ఇంకా అధికారికంగా విడుద‌ల కాన‌ప్ప‌టికీ లీక్స్ కు మాత్రం కొదువ‌లేదు. అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఆ మేనిఫెస్టో లోని.(Secret Manifes)  కీల‌క అంశాలు సంచ‌ల‌నంగా క‌నిపిస్తున్నాయి.

మానిఫోస్టోలో ఏం ఉంది..?: 

తెలంగాణలో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేయటంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. ఇందుకోసం మూడు కీలకమైన అంశాలపై దృష్టి సారించింది. అందులో ప్రధానంగా నిర్భంధం, అక్షర, ఆశ్రయ వంటి వాటితో అణగారిన వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇంకా కాంగ్రెస్ మేనిఫెస్టోలో  (Secret Manifes) యువత, మహిళలు, పేదలు వంటి ఆరు అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశం.

బిసిలు, మహిళలు, పేదలకు దగ్గరగా..: (Secret Manifesto)

కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్), గృహలక్ష్మీ (ప్రతి కుటుంబంలోని మహిళకు రూ.2000), ఇందిరమ్మ స్త్రీ (బీపీఎల్ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 10 కిలోల ఆహారధాన్యాలు). శక్తి (మహిళలకు ఉచిత బస్సు రవాణా), బీసీలకు బిసీ కమిషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలు, ఇతర కులాలకు చెందిన పేదలకు కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాల మంజూరు.

ఎస్టీ, ఎస్సీలకు సరికొత్త పథకాలు:

‘దళిత బందు’ ద్వారా జరిగిన అక్రమాలను ఒకవైపు విచారణ చేస్తూ… మరోవైపు దళితులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం, సబ్సిడీలతో వడ్డీలేని రుణాలను పారదర్శకంగా అందించటం. ఇందులో ఎంపీ,ఎమ్మెల్యేల ప్రమేయంం లేకుండా ఆరోపణలు లేని స్థానిక నాయకులతో కమిటీ  ఏర్పాటు చేయటం.

యువత కోసం ఇలా…:

Also Read : Revanth Reddy : సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్‌.. బీఆర్ఎస్‌ని బంగాళ‌ఖాతంలో క‌ల‌పాలంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపు

యువ నిధి (నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు), నిర్భంధం ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల కోసం ప్రత్యేక పథకం ఈ ఆరు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారత, నిరుద్యోగ నిర్మూలన, రైతు సంక్షేమం వంటి అంశాలను   చేర్చింది. ఈ కొత్త పథకాలు అదనం.

కేసీఆర్ కు ఊహించని షాక్.!: 

ఈ ఎన్నికల మానిఫోస్టోలో కాంగ్రెస్ మొత్తం 108 పథకాలను చేపట్టింది. తెలంగాణలో భారస ఎక్కడ విఫలమయిందో… కాంగ్రెస్ అక్కడ సక్సెస్ మంత్రం (Secret Manifesto )చేపట్టింది. విద్య, వైద్య , మహిళా, బిసి, పేద వర్గాలకు చేరువలో ఆ,యా పథకాలను చేపట్టింది. ఇది ‘భారాసకు ఊహించని షాక్’ అని చెప్పవచ్చు.

Also Read : BRS vs Congress : తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు సీన్ రివ‌ర్స్‌.. స‌ర్వేల్లో..?