హైదరాబాద్ జవహర్ నగర్‌లో దారుణం జరిగింది. అద్దెకు ఇచ్చిన ఇంట్లోని బాత్‌రూం బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు ఇంటి యజమాని. ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను అద్దెకు ఉంటున్న వారు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.జవహర్‌నగర్‌లోని అశోక్ యాదవ్ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 4న బాత్రూంలోని బల్బ్ పనిచేయడం లేదని ఇంటి యజమానికి తెలపడంతో ఎలక్ట్రీషియన్ ద్వారా బల్బ్ రిపేర్ చేయించాడు. ఈ నెల 13న బాత్రూంలోని బల్బ్ హోల్డర్ నుంచి స్క్రూ పడిపోయిందని వివాహిత భర్త గమనించి దానిని పరిశీలించాడు. లోపల లైట్ వేసి చూడగా.. కెమెరా ఉన్న విషయం తెలిసింది. దీనిపై ఇంటి యజమానిని నిలదీయగా.. తిరిగి వారినే బెదిరించాడు. దీంతో చివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

Cctv Camera In Bathroom