Bhadrachalam : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

సోమవారం మధ్యాహ్నంకు నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు

  • Written By:
  • Publish Date - July 22, 2024 / 02:56 PM IST

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు అధికారులు. తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. అనేక జలాశయాలు నిండుకుండలమారిపోయాయి. ఇక భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి (Godavari) ఉదృతంగా ప్రవహిస్తుంది. ఆదివారం సాయంత్రం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. సోమవారం మధ్యాహ్నంకు నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం రెండో హెచ్చరిక నడుస్తుండడం తో పలు గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి వరద 73 అడుగుల స్థాయిని తాకితే పరవాహక ప్రాంతాల్లో 109 గ్రామాలతో పాటుగా భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని తెలిపారు. 2023లో 73 అడుగుల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏ స్థాయిలో ఏ గ్రామం ప్రభావితమవుతుందనే వివరాలను నీటిపారుదలశాఖ పోర్టల్​లో ఉంచినట్లు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. గోదావరి, కృష్ణా పరీవాహకాల్లోని ప్రాజెక్టుల వద్ద ఇంజినీర్లను అప్రమత్తం చేశామన్నారు.

మరోపక్క గోదావరి బ్రిడ్జ్ వద్ద ఎవర్ని ఫొటోస్ కానీ సెల్ఫీ లు కానీ తీసుకోనివ్వడం లేదు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయినా నేపథ్యంలో ఫొటోస్ కు అనుమతించడం లేదు. గోదావరి ఉదృతి ఎక్కువగా కొనసాగుతున్న తరుణంలో ఎవర్ని నిల్చునివ్వడం లేదు. ఒకవేళ కాదని చెప్పి ఎవరైనా ఫొటోస్ దిగితే వారిని జైలు కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. గోదావరిలో వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరదనీటిలో మునిగిపోయాయి. చర్ల మండలం వద్ద ఈత వాగు పైనుంచి వరదనీరు పారడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీత వాగు గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరదనీటిలో మునిగిపోయింది. భద్రాచలం నుంచి ఛత్తీస్​గఢ్​, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది.

ఇక ఇప్పటి వరకు 1986 లో 75.60 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ఇదే ఇప్పటి వరకు రికార్డు. 2022లో 71.30 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 1990లో 70.3 అడుగులకు, 2006లో 66.9 అడుగులకు, 1976లో 63.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చేరింది.

Read Also : ‘Note For Vote’ Case : ఓటుకు నోటు కేసు..బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు షాకిచ్చిన సుప్రీం

Follow us