Site icon HashtagU Telugu

Telangana: ఉపాధ్యాయ దంపతుల్ని ఒకే జిల్లాకు బదిలీపై సీఎంకు వినతులు

Telangana

Telangana

Telangana: సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రికి ఉపాధ్యాయులు వినతిపత్రాలు అందజేశారు. భర్త ఒక జిల్లాలో భార్య మరొక జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తమను ఇప్పటికైనా ఒకే జిల్లాకు బదిలీ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి

తెలంగాణలోని 13 జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మరోసారి జీఓఎంఎస్ 317పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి , సబ్‌కమిటీ సభ్యులకు ప్రాతినిధ్య లేఖను సమర్పించారు. తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. తెలంగాణ స్పౌజ్ ఫోరం అధ్యక్షుడు వివేక్ ఎస్ మాట్లాడుతూరాష్ట్ర విద్యా శాఖ పరిధిలోని సుమారు 1,500 మంది ఉపాధ్యాయులు జంట కేటగిరీ కింద తమ జీవిత భాగస్వామి జిల్లాకు బదిలీ చేయాలని కోరుతూ గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. దంపతులు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నందున, వారి కుటుంబాలు విడివిడిగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు.

తమ కుటుంబాలకు దూరంగా ఉన్న వీరు నిత్యం పాఠశాలల కోసం 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి విధులు నిర్వహిస్తున్నారు. దీంతో మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నారు. గతేడాది జనవరి నెలలో మొత్తం 1,656 దరఖాస్తుల పరిష్కారానికి విద్యాశాఖ ఫైలు సిద్ధం చేసినా, అందులో 615 మంది స్కూల్ అసిస్టెంట్లను గత ప్రభుత్వ ఆదేశాల మేరకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పేరుతో బదిలీ చేయగా, మిగిలిన SGT లను బదిలీ చేయబడలేదు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని సీఎంకు మొరపెట్టుకున్నారు.

Also Read: Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ నిందితుడిని గుర్తించిన పోలీసులు

Exit mobile version