Vidyadhan Scholarship: పదో తరగతిలో కనీసం 90 శాతం మార్కులు లేదా 9 సీజీపీఏ సాధించిన వారికి గుడ్ న్యూస్. వారంతా సరోజినీ దామోదర్ ఫౌండేషన్‌కు చెందిన విద్యాధన్ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగ విద్యార్థులకు పదో తరగతిలో కనీసం 75 శాతం లేదా 7.5 సీజీపీఏ వచ్చి ఉంటే చాలు.. అప్లై చేయొచ్చు. వీరు తప్పకుండా దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. విద్యార్ధులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించొచ్చు. విద్యాధన్ అధికారిక వెబ్ సైట్ https://www.vidyadhan.org/web/index.php ద్వారా అప్లికేషన్లు దాఖలు చేయాలి.
ఇవి గుర్తుంచుకోండి
- విద్యాధన్ స్కాలర్‌షిప్(Vidyadhan Scholarship)కు అప్లై చేసేటప్పుడు విద్యాధన్ వెబ్‌సైట్ కోసం ప్రత్యేక పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.
- విద్యార్థులు సొంతంగా ఈమెయిల్ ఐడీ ఉండాలి. ఇతరుల మెయిల్ ఐడీల నుంచి అప్లై చేస్తే దరఖాస్తును స్వీకరించరు.
- ఎంటర్ చేసిన ఈ మెయిల్ ఐడీకి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది.
- పదో తరగతి మెమో ప్రకారం వివరాలను అప్లికేషన్ ఫామ్‌లో నమోదు చేయాలి.
- ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను కూడా అప్ లోడ్ చేయాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉన్నవారే ఈ ఉపకారవేతనానికి అర్హులు. 2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి.
- దరఖాస్తు ప్రక్రియపై డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 080683 33350కు కాల్ చేయాలి.
- దరఖాస్తుదారులకు జులై 13న ఆన్‌లైన్‌లో రాత పరీక్షను నిర్వహిస్తారు.
- ఎంపికయ్యే వారికి ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.75 వేల దాకా స్కాలర్‌షిప్‌లను అందిస్తారు.
Also Read :AI Model Blackmailing : అక్రమ సంబంధాలను బయటపెడతా.. డెవలపర్‌ను బెదిరించిన ఏఐ
సరోజినీ దామోదర్ ఫౌండేషన్ గురించి..
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ దన్నుగా నిలుస్తోంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు అండగా నిలబడుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 వేల మంది విద్యార్థులకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లను ఇస్తోంది.