ఫిబ్రవరి 15న బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి (Sant Sevalal Maharaj Jayanti) వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బంజారా గిరిజన ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ప్రకటించింది. అయితే ఈ సెలవు సాధారణ ప్రజలకు కాకుండా కేవలం బంజారా ఉద్యోగులకే వర్తించనుంది. స్కూళ్లకు, ఇతర ప్రభుత్వ శాఖలకు సాధారణ పనిదినంగానే కొనసాగుతుందని అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Good News : స్కూలు విద్యార్థులకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు
సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతికి మార్గదర్శకుడిగా నిలిచిన మహోన్నత వ్యక్తి. దేశమంతా సంచరిస్తూ, బంజారాలకు హితబోధ చేసిన ఆయన్ని గిరిజన సమాజం ఆరాధ్యదైవంగా భావిస్తోంది. ఆయన బంజారాలను మూఢనమ్మకాల నుంచి విముక్తులను చేసేందుకు, హింస, మద్యపానం లాంటి వ్యసనాల నుంచి దూరం ఉండేలా ప్రబోధించినట్లు చరిత్ర చెబుతోంది. బంజారా సంఘాలు ఈ జయంతిని పండుగలా నిర్వహించుకుంటాయి. గతేడాది తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు ప్రకటించింది. ఈసారి కూడా అదే విధంగా అమలు చేయాలని లంబాడాల ఐక్యవేదిక నుంచి విజ్ఞప్తులు చేసాయి. ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుని బంజారా ఉద్యోగులకు ప్రత్యేక సెలవును మంజూరు చేసింది.