Sankranti 2025 : సంక్రాంతి సంబురాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పండుగ సెలబ్రేషన్స్‌కు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికిన వారిలో కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. సంక్రాంతి వేళ కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన పూజల్లో మోడీ పాల్గొన్నారు. దీపారాధన చేశారు. మోడీ స్వయంగా భోగి మంటలను(Sankranti 2025) అంటించారు. ఈకార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రధాని మోడీకి కిషన్ రెడ్డి ఒక జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమం వేళ ప్రధాని మోడీ పక్కనే మెగాస్టార్ చిరంజీవి కూర్చోవడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, టీవీ9 యాజమాన్యంలోని పలువురు సైతం పాల్గొన్నారు. ప్రధాని మోడీ వెంట ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, గజేంద్ర షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ కట్టర్, పెమ్మసాని చంద్రశేఖర్, సతీశ్ చంద్ర దూబే, శ్రీనివాస్ వర్మ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు ఉన్నారు.
Also Read :At Least Four Kids : నలుగురు పిల్లల్ని కనే దంపతులకు రూ.లక్ష : మధ్యప్రదేశ్ బోర్డు ఆఫర్
ఈ బీజేపీ నేతలు కూడా..
ఈ వేడుకల్లో పాల్గొన్న వారిలో బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, లక్ష్మణ్, గోడెం నగేష్, బాలశౌరి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి , డీకే అరుణ సహా పలువురు తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారు. ఈ ఈవెంట్‌లో బసవన్న ఆశీర్వాదాలు, కథలు, డ్యాన్స్ తదితర కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంక్రాంతి వేడుకల నేపథ్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంటిని ముస్తాబు చేశారు. అతిథులకు తెలుగు వంటలను రుచి చూపించేలా పలు వంటకాలను సిద్ధం చేశారు.