Site icon HashtagU Telugu

Taxi Safe App: ఆటో ఎక్కుతున్నారా.. ‘ట్రేస్ మై లొకేషన్‌’ తో నేరాలకు చెక్!

Safe Taxi

Safe Taxi

మీరు ఆటోలో (Auto) ఎక్కుతున్నారా..  అయితే  బీ కేర్ పుల్ గా ఉండండి.. ఆటో ప్రయాణంలో ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా.. అంతే సంగతులు. మఖ్యంగా మీ పక్కన అపరిచిత ప్రయాణికులు ఉన్నా.. అందులోనూ వారు మహిళలు ఉన్నా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఇటీవల వరంగల్ లో జరిగిన ఘటన ఒకటి తెలంగాణ (Telangana) వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆటో ఎక్కిన మహిళపై గ్యాంగ్ రేప్ చేశారు డ్రైవర్, అతని స్నేహితులు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల (sircilla) పోలీసులు ఈ నేరాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు.

ట్రేస్ మై లొకేషన్

మహిళలు, అమ్మాయిలు (Girls) రాత్రి వేళలో క్యాబ్స్, ఆటోలు, కార్లలో ప్రయాణించడం కామన్. అయితే ప్రయాణం మాటున అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. దీంతో సిరిసిల్ల పోలీసులు (Police) అడ్డుకట్టు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 1600కి పైగా ఆటోల్లో క్యూఆర్‌ కోడ్‌ను అతికించారు. మొత్తం 3000కు పైగా ఆటోల్లో క్యూఆర్‌ కోడ్‌ను అతికించారు. ట్రేస్ మై లొకేషన్‌ని క్లిక్ చేయడం వల్ల ఆపద సమయంలో మీ లైవ్ లొకేషన్‌ను పోలీసు కంట్రోల్ రూమ్‌కు వెళ్తుంది. వెంటనే పోలీసులు మీరున్న ప్రాంతానికి చేరుకొని రక్షిస్తారు.

వరంగల్ జిల్లాలో గ్యాంగ్ రేప్

వరంగల్‌ జిల్లాలో అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ సహా అతడి స్నేహితులు అత్యాచారానికి ఒడిగట్టారు. హనుమకొండ నయీంనగర్ సమీపంలో నివసించే వివాహిత గత నెల 27న పనిపై బయటకు వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరింది. కేయూ క్రాస్ వద్ద ఆటోను ఆపి రంగ్‌బార్ వద్ద దింపాలని కోరింది. సరేనని ఆమెను ఎక్కించుకున్న డ్రైవర్ రాకేశ్ తన స్నేహితులు ఆటో డ్రైవర్లు సనత్, సతీశ్‌కు ఫోన్ చేశాడు. వారొచ్చి ఆటో ఎక్కగానే ఆటోను ముందుకు పోనిచ్చాడు. ఆటో ఆమె చెప్పిన చోటుకు కాకుండా భీమారం వైపు వెళ్తుండడంతో అనుమానం వచ్చిన ఆమె ప్రశ్నించింది. రాకేశ్ స్నేహితులు ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఆటోలోని సౌండ్ పెంచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె చెప్పిన రంగ్‌బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: Girls Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన ఇద్దరమ్మాయి.. ముద్దులు పెట్టుకుంటూ, స్టంట్స్ చేస్తూ!