Site icon HashtagU Telugu

Rythu Bharosa: రైతు భ‌రోసాకు అర్హులు వీరే.. వారికి నిరాశే!

Rythu Bharosa

Rythu Bharosa

Rythu Bharosa: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి (Rythu Bharosa) సంబంధించి విధివిధానాలు విడుదల చేసింది. రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు 12 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించిన విష‌యం తెలిసిందే. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వ‌నున్నారు. ROFR పట్టాదారులు రైతు భరోసాకు అర్హులు అని తెలిపారు. రైతు భరోసా వ్యవసాయ శాఖ అమలు చేయ‌నుంది. జిల్లాల్లో రైతు భరోసా అమలు ఫిర్యాదులు సమస్య పరిష్కారం బాధ్యత కలెక్టర్లదేన‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో.. వ్య‌వసాయాన్ని లాభసాటిగా చేయుటకు కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చు. ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి, ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం “రైతుభరోసా” పథకాన్ని జనవరి 26, 2025 నుండి అమలు చేయ‌నున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.

Also Read: Anil Ambani : అచ్యుతాపురం సెజ్‌ వైపు.. అనిల్‌ అంబానీ చూపు.. ఎందుకు ?

రైతుభరోసా పథకంలోని ముఖ్యాంశాలు