Site icon HashtagU Telugu

Runamafi: శుభ‌వార్త‌.. వారికి కూడా రూ. ల‌క్ష రుణ‌మాఫీ!

Runamafi

Runamafi

Runamafi:చేనేత కార్మికులకు లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ (Runamafi) చేస్తు ప్రభుత్వ ఉత్తర్వు నెం. 56 ను ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ఇందుకోసం రూ. 33 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతు.. గత ప్రభుత్వంలో చిన్నచూపుకు గురైన చేనేత రంగాన్ని సంవత్సరం కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకొన్నామని మంత్రి తెలిపారు.

త‌మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖలు / సంస్థలు / సమాఖ్యల నుండి బట్టలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు G.O.MS No.1, I&C (TEX) Dept., Dt. 11.03.2024 జారీ చేసి టీజీఎస్‌సీవో నుండి కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకొన్నామన్నారు. దీనివలన నేతన్నలకు నిరంతర ఉపాధి కలగడమే కాకుండా, వారి జీవనోపాధి మెరుగుపడటానికి, అలాగే చేనేత పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. చేనేత రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ మరియు మన స్కిల్స్ ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకునేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ (IIHT) స్థాపించుకొన్నామన్నారు. ఇందులో ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులకు మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు (DHTT) అందించబడుతుందని మంత్రి పేర్కొన్నారు.

Also Read: New Zealand Innings: ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌.. టీమిండియా టార్గెట్ ఇదే!

పవర్‌లూమ్ ఆసామీల దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించేందుకు, ప్రభుత్వం G.O.MS.No.18, Ind & Com (Tex) Dept., Dt. 05.10.2024 ద్వారా వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యార్న్ డిపో స్థాపించుకొన్నామని, ఇందుకోసం రూ.50 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేసామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి “తెలంగాణ చేనేత అభయహస్త పథకం” ను కూడా అమలుచేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారని, 2024-25 సంవత్సరానికి గాను ప్రభుత్వం G.O.MS.No:3, Ind & Com (Tex) Dept., Dt. 10.01.2025 ద్వారా రూ.168.00 కోట్ల నిధులతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. నేతన్న చేయూత పథకం ద్వారా రూ.290.09 కోట్లు విడుదల చేసి, 36,133 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చామని, tgscoకు రూ.494.48 కోట్లు విడుదల చేసి, చేనేత సహకార సంఘాలు, ఎస్‌ఎస్‌ఐ, మాక్స్ సంస్థలకు పెండింగ్ చెల్లింపులు చేశామన్నారు.

నేతన్న బీమా పథకం కింద పది లక్షల రూపాయల బీమా కల్పిస్తూ, వయోపరిమితిని తొలగించి, నేతన్న వృత్తిలో ఉన్నంతకాలం బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనన్నారు. చేనేత సహకార సంఘాల నుండి స్టాకులను కొనుగోలు చేసి, సంబంధిత చెల్లింపులను సమయానికి విడుదల చేయడం ద్వారా నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.