తెలంగాణ సర్కార్ (Telangana Govt) హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ట్రాఫిక్ (Traffic) ఎలా ఉంటుందో చెప్పాలిన పనిలేదు. రోజులో సగం టైం ట్రాఫిక్ లోనే గడిచిపోతుంటుంది. ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించినప్పటికీ పెరుగుతున్న జనాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఇక వర్షం పడిందంటే ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం అవుతుంటుంది. ఇక KBR పార్క్ చుట్టూ కూడా నిత్యం ట్రాఫిక్ జాం అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. KBR పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు, సిగ్నళ్లు, యూటర్న్‌లు లేకుండా చర్యలు చేపట్టింది. 826 కోట్ల రూపాయలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు పాలనాపరమైన అనుమతులిచ్చింది సర్కార్. ఈ మేరకు ఏ జంక్షన్ లో ఎంత మేర ఖర్చు పెట్టబోతున్నారో..ఆ వివరాలను తెలియజేసారు.
* రూ. 421 కోట్లతో ప్యాకేజీ-1లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ :
1. రోడ్డు నెం.45 నుంచి కేబీఆర్ పార్కు యూసఫ్‌గూడ వైపు వై ఆకారంలో అండర్‌పాస్.
2. కేబీఆర్ పార్కు ప్రవేశం నుంచి రోడ్డు నెం.36 వరకు నాలుగు లైన్ల ప్లైఓవర్.
3. యూసఫ్‌గూడ వైపు నుంచి రోడ్డు నెం.45 జంక్షన్ వరకు రెండు లైన్ల ప్లైఓవర్.
కేబీఆర్ ఎంట్రెన్స్ ముగ్ధ జంక్షన్ :
1. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2 లేన్ల అండర్‌పాస్
2. పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మూడు లేన్ల ప్లైఓవర్
3. కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్ పాస్
405కోట్లతో ప్యాకేజీ-2లో.. రోడ్ నెం.45 జంక్షన్ :
1. ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వరకు అండర్ పాస్*
2. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి రోడ్ నెంబర్-45 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్
ఫిలింనగర్ జంక్షన్ :
1. అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెం.45 జంక్షన్ వరకు 2 లైన్ల అండర్‌పాస్
2. ఫిలింనగర్ జంక్షన్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్
మహారాజా అగ్రసేన్ జంక్షన్ :
1. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఫిలింనగర్ జంక్షన్ వరకు అండర్ పాస్
2. ఫిలింనగర్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్-12 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్
క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ :
1. కేబీఆర్ పార్కు నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రెండు లైన్ల అండర్ పాస్