Rs 500 Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్లను ప్రజలకు అందించే ‘మహాలక్ష్మి’ స్కీమ్(Rs 500 Gas Cylinder) కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కింద సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఎలా పంపిణీ చేయాలి ? ఎవరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలి ? అనే దానిపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటి ప్రకారం రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకం వర్తింపచేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకొని సిలిండర్లు ఇస్తారని అంటున్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రపోజల్ వచ్చినప్పటికీ.. అది అమలు చేసేందుకు ఎక్కువ టైం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
రాయితీ సిలిండర్లు ఏడాదికి ఆరు ఇవ్వాలా ? పన్నెండు ఇవ్వాలా? అనే దానిపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబ సభ్యుల సంఖ్య, గతేడాది వాడిన సిలిండర్ల సంఖ్య ఆధారంగా లబ్ధిదారులకు పంపిణీ చేసే సిలిండర్ల సంఖ్యను డిసైడ్ చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రతినెలా సిలిండర్ రీఫిల్ చేసుకునే వారు 44 శాతం మందే ఉన్నారు. కొత్తగా రేషన్ కార్డులు తీసుకునే వారికి ఈ పథకాన్ని వర్తింపజేసే ఛాన్స్ ఉంది. కొత్తగా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారికి మాత్రం ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చకూడదని అనుకుంటున్నారు.
Also Read: WFI – Sports Ministry : డబ్ల్యుఎఫ్‌ఐ కొత్త కార్యవర్గం సస్పెండ్.. ఎందుకు ?
రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు 1.20 కోట్లు ఉన్నాయి. రేషన్ కార్డులు 89.98 లక్షలు ఉన్నాయి. ‘గివ్ ఇట్ అప్’లో భాగంగా 4.2 లక్షల మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే లబ్ధిదారుల సంఖ్య 85.79 లక్షలుగా ఉంది. రేషన్ కార్డు డేటా బేస్ తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది. ఇప్పటికే ‘ఉజ్వల’ గ్యాస్ కనెక్షన్లకు రూ.340 రాయితీ అందుతోంది. మొత్తం కనెక్షన్లలో ఇవి 11.58 లక్షల దాకా ఉంది.