Hiring Mason : ఏ ప్రొఫెషన్ అయినా దానికదే సాటి.. తాపీ మేస్త్రీలకు కూడా మార్కెట్లో ఇప్పుడు ఒక రేంజ్‌లో డిమాండ్ ఉంది. వాళ్లకు శాలరీ ప్యాకేజీలను భారీగానే ఆఫర్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిల్డర్స్ దగ్గర తాపీ మేస్త్రీలకు వర్క్ ఎలాగూ ఉంటుంది. ఇక పెద్దపెద్ద సంస్థలు కూడా తాపీ మేస్త్రీలను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. వాటి క్యాంపస్‌లలోని భవనాల వర్క్స్ కోసం తాపీ మేస్త్రీల సేవలను వాడుకుంటాయి. తాజాగా హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తాపీ మేస్త్రీ జాబ్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైనా ఈ ఉద్యోగానికి(Hiring Mason) దరఖాస్తు చేసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join
నానక్‌రామ్‌గూడలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఒకే ఒక తాపీ మేస్త్రీ జాబ్ ఉంది. సంవత్సరానికి 4 లక్షల 47వేల 348 రూపాయలు శాలరీ ప్యాకేజీ ఇస్తారు. ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వారానికి 40 గంటలు పనిచేస్తే సరిపోతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. తాపీ పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేయాలి. కాంక్రీటు గ్రేడ్‌లు, కాంక్రీటు వేయడం, ఇటుక పని, టెర్రాజో ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, హాలో కాంక్రీట్ బ్లాక్స్ వాల్, సహజ రాయి వేయడం, కట్టింగ్ మొదలైన పనులు తెలిసి ఉండాలి. వివిధ నిర్మాణ పనుల కోసం ఎంత మెటీరియల్ వాడాలనే అంచనాలు కూడా తెలిసి ఉండాలి.
Also Read : Jeff Bezos : రూ.75వేల కోట్ల షేర్లు అమ్మేస్తా.. అపర కుబేరుడి ప్రకటన
కనీసం 8వ తరగతి కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో రాయడం, మాట్లాడటం, చదవడం వచ్చి ఉండాలి. వీటిపై టెస్ట్‌లు కూడా నిర్వహిస్తారు. న్యూమాటిక్ సుత్తులు, కాంక్రీట్ స్ప్రేయర్‌లతో గతంలో పనిచేసిన అనుభవం అవసరం. ఎటువంటి వాతావరణంలో అయినా పని చేయడానికి శారీరక సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు పబ్లిక్ ట్రస్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అప్లై చేసేటప్పుడు పైన చెప్పిన విద్యాప్రమాణాలకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించాలి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత.. అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వివరాలను అభ్యర్థుల మెయిల్‌కు పంపిస్తారు. ఇంటర్య్వూ సమయంలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సెలక్షన్ చేస్తారు. ఇంకా వివరాలు కావాలంటే HyderabadVacancies@state.gov మెయిల్ ఐడీకి మెయిల్ చేయొచ్చు.