Robbery in Hyderabad : యూపీ తరహాలో పట్టపగలే హైదరాబాద్‌ బంగారం షాప్‌లో దోపిడీ

హైదరాబాద్ (Hyderabad) లో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే గన్ లతో , కత్తులతో బెదిరించి దోపిడీ (Robbery) చేస్తున్నారు. తాజాగా మలక్‌పేట – అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌లో ఈ తరహా దొంగతనమే జరిగింది. టోపి, మాస్క్ ధరించి ఒకరు కస్టమర్ లాగా వచ్చి కత్తితో బెదిరించి షాప్‌ల ఉన్న గోల్డ్ దోచుకొని కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని కొట్టారు. దీనికి సంబదించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ తరహా ఘటనలు ఎక్కువగా […]

Published By: HashtagU Telugu Desk
Robbery In Hyderabad

Robbery In Hyderabad

హైదరాబాద్ (Hyderabad) లో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే గన్ లతో , కత్తులతో బెదిరించి దోపిడీ (Robbery) చేస్తున్నారు. తాజాగా మలక్‌పేట – అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌లో ఈ తరహా దొంగతనమే జరిగింది. టోపి, మాస్క్ ధరించి ఒకరు కస్టమర్ లాగా వచ్చి కత్తితో బెదిరించి షాప్‌ల ఉన్న గోల్డ్ దోచుకొని కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని కొట్టారు. దీనికి సంబదించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ తరహా ఘటనలు ఎక్కువగా యూపీ , బీహార్ లలో జరుగుతాయి.

We’re now on WhatsApp. Click to Join.

పట్టపగలు , జనాలంతా ఓ పక్క తిరుగుతుండగా..అక్కడి దొంగలు ఏమాత్రం భయం లేకుండా గన్ లతో బంగారం షాపుల్లోకి చొరబడి షాప్ యజమానులు బెదిరించి షాపుల్లోని బంగారాన్ని దోచుకుంటారు. ఇక ఇప్పుడు ఈ తరహా దొంగతనాలు హైదరాబాద్ లో మొదలుపెట్టడం తో వ్యాపారస్తులు భయపడుతున్నారు. పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటె గత పదిరోజులుగా బీహారు కు చెందిన దొంగల ముఠా..పిల్లలను కిడ్నాప్ లు చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలను టార్గెట్ గా చేసుకొని వారికీ చాకెల్ట్స్ , స్వీట్స్ ఆశ చూపించి దగ్గరి చేసుకొని , ఆ తర్వాత వారిని ఎత్తుకెళ్తున్నారు. ముఖ్యంగా నిజామాబాదు , వరంగల్ , కరీంనగర్ లలో ఈ ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మరోపక్క పిల్లల కిడ్నాప్ ల విషయం సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం తో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Shad Nagar MLA : బడ్జెట్ కాపీతో పండ్లలో పాసును తీసుకుంటున్న షాద్ నగర్ ఎమ్మెల్యే

  Last Updated: 15 Feb 2024, 11:33 AM IST