తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లా వెలిమినేడు దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులోని ఐదుగురు ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: CM KCR: నేడు కొండగట్టుకు సీఎం కేసీఆర్
కండక్టర్ మృతి
మరోవైపు.. బల్వంతపూర్ ఎక్స్‌రోడ్ వద్ద కొండగట్టు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కట్టెలలోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ప్రయాణికులను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.