Dasoju Sravan: ఫేక్ ప్రీ పోల్ సర్వే తో రేవంత్ మైండ్ గేమ్ : దాసోజు శ్రవణ్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని లోక్ పోల్ తమ సర్వే బయటపెట్టిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - October 6, 2023 / 11:29 AM IST

Dasoju Sravan: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని లోక్ పోల్ తమ సర్వే బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆ సర్వే, రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓటుకు నోటు దొంగ ఇప్పుడు సీటుకు నోటు దొంగగా మారిండు.. తస్మాత్ జాగ్రత్త.. ఫేక్ సర్వే రిపోర్టులతో  టిక్కెట్ల కోసం పోటీ పెంచి, కోట్లకొద్దీ నోట్లు దండుకునే చిల్లర కుట్ర చేస్తున్నారు రేటెంత” రెడ్డి, “కొనుగోలు” సునీల్. అసెంబ్లీ ఎన్నికల పేరుమీద ఇప్పటికే కోట్లకొద్దీ రూపాయలు, భూముల దోపిడీకి ఈ తోడుదొంగలు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే సీటుకు, నోటు రేటును  పెంచేందుకై దుష్ట వ్యూహాలకు పాల్పడుతుండ్రు’’ అని దాసోజు మండిపడ్డారు.

“రేటెంత” రెడ్డి; “కోనుగోలు” సునీల్  కుట్ర పన్ని సోషల్ మీడియాలో ఫేక్ ప్రీ పోల్ సర్వే రిపోర్టులను ప్రచారం చేస్తు, మైండ్ గేమ్ ఆడుతుండ్రు.  ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు, దాదాపు 50 నియోజక వర్గాలలో పోటీచేసేందుకు సమర్థులైన అభ్యర్థులు లేరు. ఉన్న  అభ్యర్థులను కనీసం ప్రకటించలేని దుస్థితి, కానీ మెజారిటి సీట్లు గెలుస్తారని, తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెడుతున్న సీటుకు నోటు దొంగ  “రేటెంత” రెడ్డి,  “కోనుగోలు” సునీల్’’ అని దాసోజు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా లోక్ పోల్ సర్వే చేయగా..అధికార పార్టీ బిఆర్ఎస్ 45 – 51 , కాంగ్రెస్ 61 -67 , AIMIM 6 – 8 , బిజెపి 2 -3 , ఇతరులు 0 – 1 రావొచ్చని ఈ సర్వేలు తేలింది. అలాగే ఓటింగ్ శాతం కూడా చూస్తే..బిఆర్ఎస్ 39% – 42 %, కాంగ్రెస్ 41% -44% , AIMIM 3% – 4 %, బిజెపి 10 % – 12 %, ఇతరులు 3 % – 5 % . మరి నిజంగా ఈ సర్వే చెప్పినట్లే జరిగితే అధికార పార్టీ కి భారీ షాక్ తగిలినట్లే..ఒకవేళ AIMIM మద్దతు ఇచ్చిన అధికార పార్టీ అధికారంలోకి రావడం కష్టమే అవుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేం అంటున్నారు రాజకీయ విమర్శకులు.

Also Read: Best Foods To Metabolism: మీ జీవక్రియ బాగుండాలంటే మీరు చేయాల్సింది ఇదే..!