Site icon HashtagU Telugu

KTR-Revanth : డ్రామారావు..డ్రామాలు ఆపాలంటూ రేవంత్ ఫైర్

Ktr Revanth

Ktr Revanth

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి మంత్రి కేటీఆర్ (KTR) ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy)పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ మీద రేవంత్ ఫైర్ అయ్యారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని కాంగ్రెస్‌కు అంటగట్టాలని, తద్వారా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని కేటీఆర్‌పై మండిపడ్డారు. మీతండ్రి కేసీఆర్ డ్రామాలు తెలంగాణ సమాజానికి అర్థమైందని రేవంత్ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘డ్రామారావూ… కేసీఆర్ (KCR) అంటేనే గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలకు మారుపేరని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టే’ నని పేర్కొన్నారు. ఈ సరికొత్త మొండి కత్తి డ్రామాను మీరు, మీ తండ్రి కలిసి రక్తి కట్టిస్తున్న వైనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని, జరిగిన దుర్ఘటనను కాంగ్రెస్‌కు అంటగట్టే మీ కుటిల నీతి ప్రజలకు అర్థమైందన్నారు. ఏది ఏమైనా దాడిని మాత్రం ఖండిస్తున్నామని, అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిన కాంగ్రెస్‌కు మీ తండ్రిలాంటి మరుగుజ్జును ఓడించడం పెద్ద లెక్క కాదన్నారు.

ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు..నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2వ తేదీ లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు. నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2వ తేదీ లోపు ఫించన్ ఇవ్వు., నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2వ తేదీ లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు. నిన్న మేం ఎలక్షన్ కమిషన్‌కు చెప్పింది ఇదే. నీలాంటి వాడిని చూసే “నిజం చెప్పులు తొడుక్కునే లోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది” అనే సామెత పుట్టింది. డ్రామాలు ఆపి… నవంబర్ 2వ తేదీ లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వు… లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుంది’’ అని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.

Read Also : Kasani Gnaneshwar: టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్