CM Revanth Reddy : మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న సీఎం రేవంత్

ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడైనా , ఇప్పుడు సీఎం గా ఉన్నప్పుడైనా రేవంత్ (Revanth Reddy) తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. అన్న అంటే చాలు చెప్పమ్మా అంటూ దగ్గరికి వచ్చి నీ బాధ ఏంటి అమ్మ అని పలకరిస్తారు. తాజాగా ఇప్పుడు సీఎం స్థాయి లో ఉండి , బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా ఎక్కడో దూరంగా అన్న అని పిలవగానే ఆ పిలుపు విని దగ్గరికి వచ్చి సాయం చేసి మరోసారి తన గొప్ప […]

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Responded To The

Cm Revanth Responded To The

ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడైనా , ఇప్పుడు సీఎం గా ఉన్నప్పుడైనా రేవంత్ (Revanth Reddy) తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. అన్న అంటే చాలు చెప్పమ్మా అంటూ దగ్గరికి వచ్చి నీ బాధ ఏంటి అమ్మ అని పలకరిస్తారు. తాజాగా ఇప్పుడు సీఎం స్థాయి లో ఉండి , బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా ఎక్కడో దూరంగా అన్న అని పిలవగానే ఆ పిలుపు విని దగ్గరికి వచ్చి సాయం చేసి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

గత శుక్రవారం ప్రజా దర్బార్‌ (Praja Darbar ) నిర్వహించి ప్రజల సమయాలు వింటూ మీకు అన్నివేళలా నేనున్నానని భరోసా కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి.. శనివారం రోజు ఓ సామాన్యుడిలా ట్రాఫిక్‌తో పాటే ప్రయాణించారు. ఇక ఇప్పుడు ఓ చెల్లి ఆపదలో ఉన్నాం అన్నా అని గోడు వెలిబుచ్చడంతో వెంటనే స్పందించారు. తుంటి ఎముక విరగడం తో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను (Former CM KCR) పరామర్శించేందుకు ఆదివారం సీఎం రేవంత్ ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌ను పరామర్శించి తిరిగి వెళ్తుండగా రేవంత్ అన్నా అంటూ ఓ మహిళ పిలిచింది. మహిళ పిలిచిన వెంటనే స్పందించిన సీఎం.. ఆమె దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో చెప్పమని అడిగారు. దీంతో తన పాపకు ఆస్పత్రి ఖర్చు చాలా అవుతోందని, సాయం చేయాలని మహిళ కోరింది. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామాన్యులు పిలవగానే పలికిన సీఎం రేవంత్ వ్యక్తిత్వంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read Also : CM Revanth Reddy Meets Jana Reddy : జానారెడ్డి ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

  Last Updated: 11 Dec 2023, 12:58 PM IST