తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth )పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలన పాకిస్థాన్ (Pakistan) కంటే దయనీయంగా ఉందని ఎద్దేవా చేసాడు. “పాకిస్థాన్‌ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డిని నమ్మి ఎవరూ అప్పు ఇవ్వడం లేదు” అని వ్యాఖ్యానించారు. ఇది ప్రభుత్వంపై పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోతున్నదని, పాలనలో అనుభవం లేకపోవడమే ఇందుకు కారణమని హరీశ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే కేవలం ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడం కాదు అని హితవు పలికారు.
24 Fingers Family: ఆ ఫ్యామిలీలో 50 మందికి 24 వేళ్లు.. ఎందుకు ? ఎలా ?
అంతేగాక బీఆర్ఎస్ పార్టీలో తన భవితవ్యంపై జరుగుతున్న ఊహాగానాలను కూడా హరీశ్ రావు తిప్పికొట్టారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అప్పుడే ఖండించానని, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడని అనేకసార్లు వెల్లడించానని, ఆయన ఆదేశాలనే అనుసరించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనను అభివర్ణించారు.
Banana: బాబోయ్.. అరటి పండ్లు ఎక్కువగా తినడం అంత డేంజరా?
హరీశ్ రావు స్పష్టంగా పేర్కొన్న విషయం ఏమిటంటే.. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని శిరసావహిస్తానని, పార్టీ మారే ప్రశ్నే లేదని అన్నారు. “మై లీడర్ ఈజ్ కేసీఆర్.. వాట్ ఎవర్ కేసీఆర్ సే, హరీశ్ రావు విల్ ఫాలో” అని అన్నారు. భవిష్యత్తులో కేటీఆర్‌కు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే, దాన్ని సంతోషంగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో తన భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన హరీశ్ రావు, మరోసారి తనవైపు వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చారు.