Site icon HashtagU Telugu

Revanth Reddy: సెక్రటేరియట్ కు రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు!

Revnath

Revnath

కొత్తగా ఏర్పాటైన సెక్రటేరియట్ (Secretariat) వద్ద సోమవారం ఆందోళన నెలకొంది. మునిసిపల్, హెచ్.ఎం.డీ ఏ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడానికి వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సెక్రటేరియట్ కు వెళ్లేందుకు యత్నించిన రేవంత్ ని (Revanth Reddy) అడ్డుకోవడం వాగ్వాదం జరిగింది.

దీంతో కొత్త సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఔటర్ రింగ్ 30 ఏళ్లు కాంట్రాక్టు ఇచ్చిన అంశంలో భారీ అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘‘ఒక ఎంపీకి (MP) ప్రత్యేకంగా అనుమతి ఏమిటీ. ఎంపీ గా నా కార్డు నాకు అనుమతి.. నన్ను అడ్డుకోవడం ఏమిటని’’ రేవంత్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకోవడంతో భారీగా ట్రాఫిక్ (Traffic) జామ్ అయ్యింది.

Also Read: Chikoti Praveen: థాయ్ లాండ్ పోలీసులకు చిక్కిన చీకోటి, 93 మంది అరెస్ట్