తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బిఆర్ఎస్ – కాంగ్రెస్ (BRS-Congress) పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ (Revanth Reddy) – కేటీఆర్ (KTR) లు పరస్పరం విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు. కేటీఆర్..రేవంత్ ను ‘రేటెంత రెడ్డి’ గా అభివర్ణిస్తుంటే..రేవంత్ కేటీఆర్ ను ‘డ్రామారావు’ గా అభివర్ణిస్తూ సెటైర్లు వేస్తున్నారు.
తాజాగా రేవంత్ తన ట్విట్టర్ X వేదికగా కేటీఆర్ ఫై నిప్పులు చెరిగారు. ‘బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండు. తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగిండు. నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న వీళ్ళ మిత్ర పార్టీ బీజేపీ, 40% కమిషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించింది. అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నది. ఇప్పుడు తెలంగాణాలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నరు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం!
కాంగ్రెస్ వస్తుంది… తెలంగాణ గెలుస్తుంది!’ అని ట్వీట్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క కేటీఆర్ మాత్రం..తమకు గతంలో వచ్చిన 88 సీట్ల కన్నా ఈసారి ఎక్కువే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 42 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని , బీఆర్‌ఎస్, బీజేపీ సహా ఇతర ఏ పార్టీల్లో టికెట్లు రానివారికోసం కాంగ్రెస్ వెతుకుతున్నదని ఎద్దేవా చేశారు. బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని అన్నారు. గతంలో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఈసారి 110 సీట్లలో డిపాజిట్లు కోల్పోవటం ఖాయమని ఎద్దేవా చేశారు. ఎన్నికల క్షేత్రంలో తమతో తలపడేది కాంగ్రెస్సేనని అన్నారు. కాంగ్రెస్‌కు తన చరిత్రే గుదిబండ అని తెలిపారు. 55 ఏండ్ల పాలనలో ఏ రంగంలో తీసుకున్నా కాంగ్రెస్ అట్టర్‌ఫ్లాప్ అని ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు.
Read Also : Talluri Jeevan Kumar : బీఆర్ఎస్‌లోకి తాళ్లూరి జీవన్ కుమార్..