Phone Tapping Issue: రేవంత్ అరెస్ట్ కు ఫోన్ ట్యాపింగే కారణం: రఘునందన్ రావు

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్టు చేశారని మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీన్ని బట్టి 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అర్థమవుతోందని.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

Phone Tapping Issue: ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్టు చేశారని మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీన్ని బట్టి 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అర్థమవుతోందని.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టెలిఫోన్ ట్యాపింగ్ పై చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీ, ఎస్‌ఐబీ చీఫ్ ఎవరనేది కూడా చూడాలన్నారు. ఈ విషయంలో అధికారులను క్షమించరాదని సూచించారు.

కేటీఆర్‌ను మొదటి ప్రతివాదిగా, హరీశ్‌రావును రెండో ముద్దాయిగా, సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకటరామిరెడ్డిని మూడో ప్రతివాదిగా చేర్చాలని డిమాండ్‌ చేశారు. అసలు నిందితులను నిందితులుగా చేర్చకుంటే కేసు పూర్తి కాదన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసే అధికారం ఎవరికీ లేదు. అధికారిక ఖర్చుతోనే అమెరికా వెళ్లినట్లు మాజీ డీజీపీ పీఏ శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఉప ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు.

ఇదిలా ఉండగా ఐదు సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి ని డిసెంబర్ 4వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కోస్గి పర్యటనను అడ్డుకోవాలని రేవంత్ పిలుపునివ్వడంతో కొడంగల్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి పై అప్పుడు కేసు నమోదయింది.

Also Read: EC: ఓటర్లకు ఈసీ కీలక సూచనలు