Site icon HashtagU Telugu

Revanth Reddy : పొలిటిక‌ల్ ఐపీఎస్, వైఎస్ త‌ర‌హాలో `ఢిల్లీ` సూర్యుడు!

Revanth Reddy

Revanth Surtydy

ప‌ట్టుమ‌ని 15 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానానికే పీసీసీ చీఫ్ ప‌ద‌విని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అందుకున్నారు. జీవిత‌కాలం ప‌నిచేసి కూడా ఆ ప‌ద‌విని అందుకోలేని కాంగ్రెస్ వాదులు కోకొల్ల‌లు. కానీ, రేవంత్ రెడ్డి కి సునాయాసంగా ఆ ప‌ద‌వి ఎలా ద‌క్కింది? పొలిటిక‌ల్ ఐపీఎస్(Political IPS)  (రేవంత్ రెడ్డి ) చేసిన వ్యూహం ఏమిటి? సీనియ‌ర్ల‌ను కూడా కాద‌ని ఏఐసీసీ ఆయ‌న‌కు ఎందుకు మ‌ద్ధ‌తు ఇస్తోంది? వైఎస్(YSR) వేసిన బాట‌లో న‌డ‌వ‌ట‌మే అధిష్టానం వ‌ద్ద రేవంత్ స‌క్సెస్ సీక్రెట్ గా క‌నిపిస్తుందా? అయితే ఆ ర‌హ‌స్యం ఏమిటి? అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్ల అన్వేష‌ణ‌.

తెలుగుదేశం పార్టీలో అధికార ప్ర‌తినిధి ప‌ద‌వి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి రాజ‌కీయంగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సుటిగా సుత్తిలేకుండా మాట్లాడ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. దానికితోడు టీడీపీ లైబ్ర‌రీ ఇచ్చే ఫీట్ బ్యాక్ ఆయ‌న ఎదుగుద‌ల‌కు బాగా తోడ్పాటును అందించింది. సీన్ క‌ట్ చేస్తే, ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవ‌డం ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఆ రోజు నుంచి ఆర్థికంగా, రాజ‌కీయంగా వేగంగా ఎదిగారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా టీడీపీలో ప‌దోన్న‌తి పొందిన త‌రువాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఆయ‌న‌కు బాగా క‌లిసొచ్చింది. చంద్ర‌బాబుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వ‌డంతో రేవంత్ రెడ్డి ప్ర‌మోష‌న్ తేలిక అయింది. నిండా ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో ప‌నిచేయ‌కుండానే పీసీపీ చీఫ్ ప‌ద‌విని చేజిక్కించుకున్నారు. ఇక ఆ రోజు నుంచి రేవంత్ రెడ్డి హ‌వా కొన‌సాగుతోంది.

పీసీసీ చీఫ్(Political IPS) ప‌ద‌విని

స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆనాడు వేసిన వ్యూహాల‌ను రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. వైఎస్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి సూర్య‌డు ద్వారా ఆ వ్యూహాల‌ను తెలుసుకున్నార‌ని వినికిడి. పీసీపీ చీఫ్ అయ్యేందుకు ఢిల్లీలో ఎవ‌రెవ‌ర్ని క‌లవాలో సూర్యుడు దారి చూపార‌ని పార్టీలోని కొన్ని వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. స్వ‌ర్గీయ వైఎస్ ఢిల్లీలో లాబీయింగ్ ఎవ‌రి ద్వారా న‌డిపేది సూర్య‌డికి బాగా తెలుసు. బెంగుళూరు కేంద్రంగా వైఎస్ ఎవ‌రితో ప‌రిచ‌యాలు పెట్టుకున్నారు? అనేది కూడా సూర్యుడికి తెలియ‌ని అంశం కాదు. అప్ప‌ట్లో మోతీలాల్ వోరా , కేసీ వేణుగోపాల్ , అహ్మ‌ద్ ప‌టేల్ త‌దిత‌రుల‌తో వైఎస్ ఎలా క‌థ న‌డిపించారో సూర్యుడు క‌ళ్లారా చూశార‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. ఆ బ్యాచ్ లో ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో కీల‌కంగా ఉన్నారు. ఆయ‌న‌తో పాటు ఏఐసీసీలోని కీల‌కంగా ఉన్న కొంద‌రు లీడ‌ర్ల‌తో లైజ‌నింగ్ ఎలా చేయాలో సూర్యుడు ద్వారా రేవంత్ బాట వేసుకున్నార‌ని సీనియ‌ర్ల‌కు ఇప్పుడు బోధ ప‌డుతోందట‌.

సూర్యుడు ద్వారా తెలుసుకున్న

ప్ర‌స్తుత క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ శివ‌కుమార్ స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి స‌న్నిహితులు. ఢిల్లీ లాబీయింగ్ కోసం కొన్ని సంద‌ర్భాల్లో వైఎస్ ఆనాడు శివ‌కుమార్ ను పంపేవార‌ని కూడా టాక్ ఉండేది. ఇవ‌న్నీ సూర్యుడు ద్వారా తెలుసుకున్న రేవంత్ రెడ్డి కుంభ‌స్థ‌లంలాంటి పీసీసీ చీఫ్(Political IPS) ప‌ద‌విని కొట్టేశార‌ని సీనియ‌ర్ల‌కు ఇప్పుడిప్పుడే తెలుస్తోందట‌. గ‌త 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ ఢిల్లీ లాబీయింగ్ ఎలా చేయాలో ఇప్పుడున్న‌ సీనియ‌ర్ల‌కు పెద్ద‌గా తెలియ‌దట‌. ఎందుకంటే, వైఎస్ ఆర్ బ‌తికున్న రోజుల్లో ఢిల్లీ వెళ్ల‌డానికి కూడా ఎవ‌రూ సాహ‌సం చేసే వాళ్లు కాదు. ఆ అవ‌స‌రం కూడా లేకుండా అన్నీ ఆయ‌న చూసుకునే వాళ్లు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఆయ‌న మ‌ర‌ణించిన త‌రువాత ఢిల్లీ చ‌క్రం తిప్ప‌గ‌లిగినోళ్ల‌దే సింహాస‌నం అన్న‌ట్టు మారింది. ఆనాడు కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా సీఎం అలాగే అయ్యార‌ని కాంగ్రెస్ వ‌ర్గాల్లోని టాక్‌. అదే త‌ర‌హాలో పీసీసీ చీఫ్ ప‌ద‌వి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ నుంచి వ‌చ్చిన రేవంత్ ఎదిగారు. పొలిటిక‌ల్ ఐపీఎస్(Political IPS) పాఠాల‌ను ప్ర‌స్తుతం ఉన్న సీనియ‌ర్ల‌కు ఆయ‌న చెబుతున్నారు. దీంతో `సేవ్ కాంగ్రెస్` అంటూ నినాదం అందుకున్నారు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy)పాద‌యాత్రకు షెడ్యూల్

స్వ‌ర్గీయ వైఎస్ త‌ర‌హాలో ఢిల్లీ కాంగ్రెస్ వ‌ద్ద రేవంత్ రెడ్డి బ‌లంగా ఉన్నారు. అందుకే, జ‌న‌వ‌రి 26న పాద‌యాత్రకు షెడ్యూల్ ఖ‌రారు చేసుకున్నారు. ఆ లోపుగా రేవంత్ రెడ్డి సంగ‌తి తేల్చుకోవాల‌ని సీనియ‌ర్లు హైద‌రాబాద్ వేదిక‌గా మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. ఈనెల 23వ తేదీ త‌రువాత ఢిల్లీ వెళ్లాల‌ని స్కెచ్ వేస్తున్నారు. అందుకోసం వ్యూహాల‌ను ర‌చించుకునేందుకు బుధ‌వారం మ‌రోసారి సీనియ‌ర్లు స‌మావేశం అయ్యారు. అయిన‌ప్ప‌టికీ రేవంత్ రెడ్డి వాళ్ల‌ను లైట్ గా (హోంగార్డుల లెక్క‌న‌) తీసుకుంటున్నారు.

సీనియ‌ర్లు మాత్రం రేవంత్ రెడ్డిని పీసీపీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ కు అధిష్టానం అంగీక‌రించ‌క‌పోతే క‌నీసం ప‌వ‌ర్స్ క‌ట్ చేయాల‌ని సూచించ‌నున్నారు. లేదంటే, ఏపీలో మాదిరిగా తెలంగాణాలోనూ కాంగ్రెస్ ప‌రిస్థితి మారుతుంద‌ని భావిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా ఆనాటి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎపిసోడ్ ను ఉద‌హ‌రిస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రేవంత్ ప‌వ‌ర్స్ ను అధిష్టానం క‌ట్ చేస్తుందా? అంటే ఈజీ కాదంటున్నారు ఢిల్లీ పెద్ద‌లు. అంటే, ఆనాడు వైఎస్ త‌ర‌హాలో ఢిల్లీ చ‌క్రాన్ని రేవంత్ బిగించేశార‌న్న‌మాట‌.

Also Read : Revanth Reddy: ఢిల్లీకి చేరిన ₹. 30 కోట్ల ఫిక్సింగ్, టీఆర్ఎస్ తో రేవంత్ కుమ్మ‌క్కు..!