తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం (Telangana Assembly Election Campaign) రోజు రోజుకు మరింత వేడెక్కుతుంది. బిఆర్ఎస్ – కాంగ్రెస్ (BRS – Congress) పార్టీలు ఎక్కడ తగ్గడం లేదు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుంటే..పార్టీ అధినేతలు నియోజకవర్గాల పర్యటనలు చేస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు , ఛాలెంజ్ లు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తన ప్రచారంలో ఎక్కువగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ..కాంగ్రెస్ వస్తే ధరణి ని తీసివేస్తారని , రైతుబంధు పోతదని, రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులు వస్తాయని, 24 గంటల కరెంట్ కాస్త మూడు , నాల్గు గంటలకే పరిమితం అవుతుందని ఇవన్నీ దృష్టి లో పెట్టుకొని కాంగ్రెస్ కు ఓటు వెయ్యొద్దని కోరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కేసీఆర్ ప్రచారం ఫై రేవంత్ (Revanth)ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసివేస్తామని చెప్పలేదని , సరికొత్త యాప్ ను తీసుకొచ్చి మరింత వెసులుబాటు కల్పిస్తామని , అలాగే రాష్ట్రంలో నాణ్యమైన 24 గంటలు కరెంట్ ఇస్తామని చెపుతున్నామని అంటున్నారు. ఇదే విషయాన్నీ మరోసారి చెపుతూ కరెంట్ ఫై చర్చకు రావాలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. కరెంటుపై చర్చకు తాను సిద్ధమని లాగ్ బుక్‌లతో కేసీఆర్ రావాలంటూ ఛాలెంజ్ చేసారు. ఇద్దరం పోటీ చేస్తున్న కామారెడ్డి (Kamareddy)చౌరాస్తాలోనే చర్చిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా పూర్తి స్థాయిలో 24 గంటల పాటు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారాయన. 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్‌లో ఇటు కామారెడ్డిలో నామినేషన్ ఉపసంహరించుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు సమయం ఉందని ఈ లోపు కేసీఆర్ లాగ్ బుక్‌లతో రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. మరి కేసీఆర్ రేవంత్ సవాల్ ను స్వీకరిస్తారా..? లేక మరోవారైనా స్వీకరిస్తారా అనేది చూద్దాం.
Read Also : Jagan – Palnadu : పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం – జగన్