పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) మీద స్వపక్షంలోని వ్యతిరేకులు, ప్రత్యర్థులు చేసే ఆరోపణలు ఇంచుమించు ఒకటే. గోడల మీద పోస్టర్లు వేసుకునే రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించడం షరామామూలు అయింది. ఆ మధ్య మంత్రి మల్లారెడ్డి మీడియా కొచ్చి రేవంత్ రెడ్డి మీద పలు ఆరోపణలు చేశారు. పెద్ద బ్లాక్ మెయిలర్ అంటూ దుయ్యబట్టారు. అంతేకాదు, బిడ్డ పెళ్లి ఎలా చేశావని నిలదీశారు. ల్యాడ్ సెటిల్మెంట్లు(Land) చేస్తూ కోట్లాది రూపాయలు రేవంత్ రెడ్డి సంపాదించాడని ఆరోపణలకు దిగారు. ఎలాంటి వ్యాపారం లేకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎన్నికల సందర్భంగా పలు వేదికలపై ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి మీద స్వపక్షంలోని వ్యతిరేకులు, ప్రత్యర్థులు చేసే ఆరోపణలు(Revanth reddy)
కాంగ్రెస్ లోని సీనియర్లు కొందరు రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీద ఏఐసీపీకి ఫిర్యాదులు చేశారు. ఆయన చేసిన భూ దందాలు, సెటిల్మెంట్లు, బ్లాక్ మెయిల్ వ్యవహారం, ఓటుకు నోటు ఎపిసోడ్ తదితరాలను ఏఐసీసీకి రాతపూర్వకంగా అందించారు. వాటి మీద ఏఐసీసీ కూడా సీరియస్ గా పరిశీలిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని తెరమీదకు తీసుకొస్తోంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలన ప్రకటన చేస్తూ రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్(Land) అంటూ దుమ్మెత్తి పోశారు. ఇలా పార్టీలన్నీ రేవంత్ రెడ్డి మీద ఒకే ఆరోపణ చేయడం గమనార్హం.
Also Read : Revanth : రేవంత్ కోవర్టు రాజకీయంపై `ఈటెల`అస్త్రం, కాంగ్రెస్ లోకి ఆహ్వానంపై ఫైర్
ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఆ సందర్భంగా రెడ్యానాయక్. చేసిన కామెంట్లు మంటలు పుట్టిస్తోది. రెడ్యానాయక్ సవాల్ కు ప్రతిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా తీవ్రంగా స్పందించారు. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య వరంగల్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ హీట్ పెరిగింది. మియాపూర్ లో 5 ఎకరాల భూమి కోసమే ఎంపీగా ఉన్న కవిత, రెడ్యా నాయక్ పార్టీ మారారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన రెడ్యా నాయక్ రేవంత్ వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని అభివర్ణించారు. తాను ,తన కుమార్తెకు కవిత ఎలాంటి భూముల కోసం పార్టీ మారలేదని అన్నారు. మరో 20 ఏళ్లు భవిష్యత్తు లేదు కనుక ఆ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరామని వివరణ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి 10 చెప్పు దెబ్బలు తినాలని ఛాలెంజ్
గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనపై మియాపూర్ లో భూములు(Land) ఉన్నాయని ఆరోపణలు చేశారని, ఇప్పుడు అదే బాటలో రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని రెడ్యానాయక్ అసహనం వ్యక్తం చేశారు. తనకు హైదరాబాద్లో భూమి ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి 10 చెప్పు దెబ్బలు తినాలని ఛాలెంజ్ చేశారు.
Also Read: Revanth hard comments: ప్రగతి భవన్‌ను పేల్చివేయాలి!
కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాశనం చేశాడని, పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వచ్చిన రెండు ఎన్నికలలోనూ డిపాజిట్లు కోల్పోయారని రెడ్యానాయక్ విమర్శించారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. మహబూబాబాద్ పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఎంపీ కవితపై చేసిన ఆరోపణలకు ఆమె కూడా ఘాటుగా బదులిచ్చారు. మూతి పళ్ళు రాలగొడతా అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. భూ కబ్జాలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే అంబేద్కర్ సెంటర్ లో రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తావా అంటూ ప్రశ్నించారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి పాదయాత్ర బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య భూ ఆక్రమణల చిచ్చు రేపింది.