Revanth Reddy : BRS,కాంగ్రెస్`పొత్తు`పై కోమ‌టిరెడ్డి పొడుపు! కాంగ్రెస్లో క‌ల్లోలం!!

రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీఎం ప‌ద‌వి ఎండ‌మావిగా కొంద‌రు కాంగ్రెస్ సీనియ‌ర్లు

  • Written By:
  • Updated On - February 14, 2023 / 02:35 PM IST

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సీఎం ప‌ద‌వి ఎండ‌మావిగా క‌నిపిస్తోంది. ఎందుకంటే, కొంద‌రు కాంగ్రెస్ సీనియ‌ర్లు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు(Alliance) వాయిస్ అందుకున్నారు. రాబోవు రోజుల్లో జ‌రిగే ప‌రిణామాల‌ను ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళుతున్నారు. ఎన్నిక‌ల త‌రువాత బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటుంద‌ని కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఢిల్లీ వేదిక‌గా మీడియాకు వెల్ల‌డించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి రాజ‌కీయ క‌ల్లోలం బ‌య‌లు దేరింది.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం ప‌ద‌వి ఎండ‌మావి.(Revanth Reddy) 

తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్లు కొంద‌రు కేసీఆర్ తో క‌లివిడిగా ఉన్నారు. ఆ విష‌యాన్ని రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ‌ర్గీయులు ప‌లుమార్లు మీడియాకు లీకు చేశారు. పార్టీని కేసీఆర్ కు తాక‌ట్టు పెడుతున్నార‌ని మీడియా ముఖంగా కాంగ్రెస్ సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్ హ‌నుమంత‌రావు నెత్తీనోరు మొత్తుకున్నారు. కొంద‌రు కేసీఆర్ తో లాబీయింగ్ చేసుకున్నార‌ని రేవంత్ వ‌ర్గీయుల‌కు అనుమానం. మ‌రికొంద‌రు కేటీఆర్, క‌విత‌, హ‌రీశ్ ల‌తో క‌లిసి సెటిల్మెంట్లు చేసుకుంటున్నార‌ని అప్ప‌ట్లో రేవంత్ రెడ్డి అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెంబ‌డించారు. సీన్ క‌ట్ చేస్తే, పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఏడాదిన్న‌ర క్రితం ప‌ద‌విని పొందారు.

Also Read : Revanth Reddy : తెలంగాణలో కీల‌క మ‌లుపు, కాంగ్రెస్ తో కామ్రేడ్ల అడుగు

కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలు తిరిగి రావాల‌ని పీసీపీ చీఫ్ ప‌ద‌విని చేపట్టిన తొలి రోజుల్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) వినిపించిన డిమాండ్‌. అంతేకాదు, మై హోమ్ రామేశ్వ‌ర‌రావుతో పాటు కేసీఆర్ చేసిన బినామీ వ్య‌వ‌హారాల‌ను వెలుగెత్తారు. కాల‌క్ర‌మంలో ఆ రెండు అంశాల‌ను మ‌రుగున‌ప‌డేశారు. దీంతో రేవంత్ రెడ్డి క‌ల్వ‌కుంట్ల కుటుంబంతో కుమ్మ‌క్క‌య్యార‌ని ఆయ‌న వ్య‌తిరేక గ్రూప్ సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం మొద‌లు పెట్టింది. రాబోవు రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయ‌మ‌ని ఒకానొక సంద‌ర్భంగా విస్తృతంగా ప్ర‌చారం వెళ్లింది. దానికి బ‌లం చేకూరేలా సోనియాగాంధీని కలిసిన ప్ర‌శాంత్ కిషోర్ కూడా పొత్తు(Alliance) అంశాన్ని ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్లో చూపించారు.

కేసీఆర్ తో  కాంగ్రెస్ పొత్తు..

కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రాహుల్ గాంధీ పుట్టుక‌తో పాటు ప‌లు ర‌కాలుగా ఆయ‌న మీద రాజ‌కీయ దాడి చేస్తోన్న క్ర‌మంలో కేసీఆర్ ఖండించారు. అంతేకాదు, రాహుల్ కు మ‌ద్ధ‌తుగా నిలిచారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు దాదాపుగా ఖాయ‌మ‌ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. దాన్ని ఛేదించ‌డానికి వ‌రంగ‌ల్ వేదిక‌గా రాహుల్ ప్ర‌య‌త్నించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కేసీఆర్ తో పొత్తు(Alliance) ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. ఆ రోజు నుంచి ప్ర‌తి వేదిక‌పైనా రేవంత్ రెడ్డి(Revanth Reddy) పొత్తు అంశాన్ని తోసిబుచ్చుతూ వ‌స్తున్నారు. కానీ, సీనియ‌ర్లు మాత్రం పొత్తు అంశాన్ని తెలంగాణ నుంచి ఢిల్లీ వ‌ర‌కు లైవ్ లో ఎప్ప‌టికప్పుడు ఉంచుతున్నారు.

Also Read : Revanth : రేవంత్ కోవ‌ర్టు రాజ‌కీయంపై `ఈటెల`అస్త్రం, కాంగ్రెస్ లోకి ఆహ్వానంపై ఫైర్

తాజాగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పొత్తు(Alliance) అంశాన్ని మ‌రోసారి తెర‌మీద‌కు తీసుకొచ్చారు. రాబోవు ఎన్నిక‌ల్లో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. అలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌ని జోస్యం చెప్పారు. దానికి కార‌ణాలు లేక‌పోలేదు. ప్ర‌స్తుతం జాతీయ రాజ‌కీయాల‌ను కేసీఆర్ న‌డుపుతున్నారు. క‌మ్యూనిస్ట్ లు లేకుండా రాష్ట్రంలో ఆయ‌న అధికారంలోకి రావ‌డం క‌ష్టం. ఆ విష‌యం మునుగోడు ఉప ఎన్నిక‌తో బ‌య‌ట‌ప‌డింది. జాతీయ స్థాయిలో క‌మ్యూనిస్ట్ లు కాంగ్రెస్ పార్టీతో క‌లిసి న‌డ‌వ‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఆ క్ర‌మంలో జాతీయ ఈక్వేష‌న్ల దృష్ట్యా ఒక వేళ రాష్ట్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే, కాంగ్రెస్-బీఆర్ఎస్-క‌మ్యూనిస్ట్ కూట‌మి తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని వెంక‌ట‌రెడ్డి అంచ‌నా.

తెలంగాణ‌లో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీతో  కాంగ్రెస్  పొత్తు( Alliance )

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వేర్వేరుగా పోటీ ఉండేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నాయి. లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి యూపీఏ కూట‌మిలో బీఆర్ఎస్ చేరే అవ‌కాశం లేక‌పోలేదు. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే తెలంగాణ‌లో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీతో పొత్తు( Alliance )అనివార్య‌మ‌ని సోనియాకు ప్ర‌శాంత్ కిషోర్ ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్లోని కీ పాయింట్‌. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందుకే, గాంధీయేత‌ర కుటుంబం నుంచి మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేను కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడిగా చేయ‌డం జ‌రిగింది. ఇలాంటి రాజ‌కీయ ప‌రిణామాల‌న్నింటినీ గ‌మ‌నించిన సీనియ‌ర్ పొలిటిషియ‌న్, కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తెలంగాణ‌లోని సంకీర్ణాన్ని అంచ‌నా వేస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తును ఖ‌రారు చేశారు. అయితే, ఈ స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోని రాజ‌కీయ దెబ్బ‌గా(Revanth Reddy) తెలంగాణ‌లో ప‌రిణ‌మించ‌నుంద‌ని ఆ పార్టీలోని హార్డ్ కోర్ క్యాడ‌ర్ ఫైర్ అవుతోంది.

Also Read : Revanth hard comments: ప్రగతి భవన్‌ను పేల్చివేయాలి!