Site icon HashtagU Telugu

Revanth Reddy : తెలంగాణలో కీల‌క మ‌లుపు, కాంగ్రెస్ తో కామ్రేడ్ల అడుగు

Revanth Reddy

Revanth Comrade

పీసీసీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాద‌యాత్ర తెలంగాణ రాజ‌కీయ స్వరూపాన్ని మార్చ‌నుంది. ఆ మేర‌కు ఆయ‌న రాజ‌కీయ పావుల‌ను క‌దుపుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయ ఈక్వేష‌న్ల‌ను మార్చేయ‌బోతున్నారు. అందుకు నిద‌ర్శ‌నం సీపీఐ(CPI) క్యాడ‌ర్ రేవంత్ రెడ్డితో క‌లిసి అడుగులో అడుగు వేయ‌డ‌మే. భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలోని పిన‌పాక వ‌ద్ద రేవంత్ రెడ్డితో క‌లిసి ఏఐసీటీయూ నాయ‌కులు పాద‌యాత్ర చేయ‌డం గ‌మ‌నార్హం. కార్మిక సంఘాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని ఆ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇవ్వ‌డం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ‌కు దారితీసింది.

పీసీసీ రేవంత్ రెడ్డి పాద‌యాత్ర తెలంగాణ రాజ‌కీయ స్వరూపాన్ని(Revanth Reddy)  

స‌మ‌కాలీన రాజ‌కీయాలు పొత్తులు ఎత్తుల మీదనే ఎక్కువ ఆధార‌ప‌డ్డాయి. వాటికి అనుగుణంగా విజ‌యం ల‌భిస్తుంది. ఆ విష‌యం మునుగోడు ఉప ఎన్నిక స్ప‌ష్టం చేసింది. రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి క‌మ్యూనిస్ట్ లు క‌లుస్తార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్నారు .దేశ వ్యాప్తంగా అదే ఈక్వేష‌న్ ఉండేలా కేసీఆర్ జాగ్ర‌త్త ప‌డ‌తార‌ని భావించారు. కానీ, ఒక్కసారిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) పొలిటిక‌ల్ సీన్ మార్చేశారు. సీపీఐ(CPI) నేత‌ల‌ను త‌మ వైపు తిప్పుకున్నారు. ఆయ‌న‌తో పాటు క‌లిసి న‌డిచేందుకు అంగీక‌రిస్తూ కామ్రేడ్లు ముందుకు రావ‌డం కాంగ్రెస్ పార్టీకి శుభ‌ప‌రిణామం.

మోడీ ప‌రిపాల‌న మీద క‌మ్యూనిస్ట్ పార్టీలు మ‌రింత ఆగ్ర‌హం

తెలంగాణ వ్యాప్తంగా క‌మ్యూనిస్టుల‌కు(CPI) ఓటు బ్యాంకు ఉంది. ప్ర‌త్యేకించి వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వాళ్ల మ‌ద్ధ‌తు లేకుండా ప్ర‌ధాన పార్టీల గెలుపు అసాధ్యం. తొలి నుంచి బీజేపీ పాల‌న‌కు వ్య‌తిరేకంగా కామ్రేడ్లు ఉంటారు. ప్ర‌త్యేకించి ప్ర‌స్తుత మోడీ ప‌రిపాల‌న మీద క‌మ్యూనిస్ట్ పార్టీలు మ‌రింత ఆగ్ర‌హంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి న‌డుస్తూ ఉద్య‌మిస్తున్నాయి. యూపీఏలో క‌లిసి ప‌నిచేసిన అనుభవం కామ్రేడ్ల‌కు ఉంది. యూపీఏ-1 సంద‌ర్భంగా క‌మ్యూనిస్టులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత యూపీఏ-2కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ తిరిగి కాంగ్రెస్ కూట‌మిలో భాగ‌స్వాములు కావ‌డానికి సిద్ధంగా ఉన్నారు.

పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి తో క‌లిసి సీపీఐ నేత‌లు…(CPI)

జాతీయ ఈక్వేష‌న్ల‌ను తీసుకుంటే, తెలంగాణ‌లోనూ క‌మ్యూనిస్టులు(CPI) రాబోవు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి న‌డిచేందుకు అవ‌కాశం ఉంది. ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు ప‌లు సంద‌ర్బాల్లో వేర్వేరుగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత మోడీ స‌ర్కార్ ను ప‌డ‌గొట్ట‌డానికి ఏకం కావ‌డానికి అవ‌కాశం ఉంది. ఇదే పంథాలో బీఆర్ఎస్ పార్టీ వెళుతున్న‌ప్ప‌టికీ దానికి జాతీయ హోదా లేదు. పైగా కాంగ్రెస్, బీజేపీయేత‌ర కూట‌మి అంటూ కేసీఆర్ చెబుతున్నారు. ఆయ‌న సొంత కుంప‌టి పెట్టుకుని వెళుతున్నారు. జాతీయ పార్టీ గుర్తింపు బీఆర్ఎస్ కు రావ‌డం క‌ష్ట‌మే. అందుకే, కాంగ్రెస్ పార్టీతో క‌లిసి వెళ్ల‌డానికి జాతీయ స్థాయిలో కామ్రేడ్లు సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. దానికి నిద‌ర్శ‌నంగా పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తో క‌లిసి సీపీఐ నేత‌లు న‌డిచారు. రాబోవు రోజుల్లో సీపీఎం కూడా అదే బాట ప‌డుతుంద‌ని రాజ‌కీయ పండితుల్లోని టాక్‌.

Also Read : Revanth hard comments: ప్రగతి భవన్‌ను పేల్చివేయాలి!