Site icon HashtagU Telugu

CM Revanth Reddy: రేవంత్‌లో రాజన్నను చూస్తున్నాం

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: ఉమ్మడి రాష్ట్రానికి ఎన్నికైన చివరి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలచేత ఎన్నికై అసలైన పరిపాలన అందించిన మహా నేత. ఆయన మరణాంతరం రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయింది. అనంతరం తెలంగాకు కేసీఆర్ సీఎం కాగా ఆంధ్రప్రదేశ్ కు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కేసీఆర్ ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండగా కాంగ్రెస్ ఆధ్వర్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణలో ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాపాలనకు అడుగులు పడుతున్నాయని కొందరు భావిస్తున్నారు. గడీలు బద్దలయ్యాక ప్రజలు ప్రజా భవన్ లోకి అడుగుపెట్టారు. ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజలు బాధలు కష్టాలను వింటున్నారు. అయితే ఇదంతా రేవంత్ రెడ్డి చొరవేనని అభిప్రాయపడ్డారు రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలోని పాలనా సమర్థతను చూస్తున్నామని కొండా సురేఖ అన్నారు. హనుమకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజల సమస్యలు వినడంతోపాటు వాటి పరిష్కార చర్యలను వెనువెంటనే తీసుకునేవారని, సీఎం రేవంత్‌లో కూడా అవే పాలనా లక్షణాలు ఉన్నాయని అన్నారు. ప్రజావాణి ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో ప్రజలు ప్రజావాణికి వినతులు సమర్పిస్తున్నారని పేర్కొన్నారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ వలే ప్రతిపక్షాల గొంతు నొక్కే వైఖరి కాంగ్రె్‌సది కాదని, ప్రతిపక్షాల సలహాలు, సూచనలను సహేతుకంగా స్వీకరిస్తామని అన్నారు. ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరను విజయవంతంగా నిర్వహిస్తామని, ఆ బాధ్యతను తనకు అప్పగించడం ఆనందంగా ఉందని చెప్పారు

Also Read: Pope Francis : యేసు జన్మభూమిలో రక్తపాతం ఆపండి.. పోప్ ఫ్రాన్సిస్ పిలుపు.