తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth)పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. “రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ సీఎం. ఆయన పాలనను చూసిన ప్రజలు తిట్టరాని తిట్లు తిడుతున్నారు. సీఎంగా రేవంత్ పూర్తిగా అసమర్థుడు. ఏడాది కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు” అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో అనుభవం లేకుండా ఉండటం వల్లే ఈ విధంగా పాలన సరిగా జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Kavitha – KTR : కేటీఆర్ తో మీరు క్లోజ్ గా ఉంటారా..? కవిత చెప్పిన సమాధానం ఇదే !
గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కవిత ఎత్తి చూపారు. “గోదావరి నీటి దోపిడీ జరుగుతోంది. దాన్ని ఆపడంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారు. ఇది ఆయన చేతులో పనే అయినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారని” అని ఆమె తెలిపారు. రాష్ట్ర హక్కులను కాపాడటంలో ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీనే మెరుగైన విజయాన్ని సాధిస్తుందని కవిత అభిప్రాయపడ్డారు. “రెవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విసుగు చెందుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో మేము చేసిన అభివృద్ధి పనులే మాకు ఓట్లు తెస్తాయని, ప్రజలు సైతం బిఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారని , ప్రజలపై మాకు నమ్మకం ఉంది” అని ధీమా వ్యక్తం చేశారు.