Lok Sabha Poll : బీజేపీకి ఓటు వేస్తే..రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయి – రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని , పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేయలేదని మండిపడ్డారు.

  • Written By:
  • Publish Date - May 10, 2024 / 08:41 PM IST

బీజేపీ(BJP)కి ఓటు వేస్తే, తెలంగాణ(Telangana)కు వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని .. ఏ రాష్ట్రంలోనైనా మత కలహాలు ఉంటే పరిశ్రమలు రావని, ఉపాధి అవకాశాలు పెరగవని నారాయణపేట జిల్లా మక్తల్‌ (Makthal Jana Jatara Sabha)లో ఏర్పాటు చేసిన జన జాతర సభలో సీఎం రేవంత్ పేర్కొన్నారు. మతం పేరుతో మాత్రమే రాజకీయాలు చేసే బిజెపికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ ఓడిపోతే, పాలమూరు జిల్లాకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. పాలమూరు దోపిడీకి పాల్పడ్డ బీఆర్​ఎస్​కు, ఇక్కడి అభివృద్ధిని ఓర్వని బీజేపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని , పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. జిల్లా నుంచి కృష్ణా జిలాలు పోతున్నా ఇక్కడి భూములను కేసీఆర్ ఎడారి చేశారని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పాలమూరు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందని , కాంగ్రెస్ ను ఓడించేందుకు డీకే అరుణ బీజేపీ నేతలతో కలిసి కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి గెలిస్తేనే ఈ జిల్లాలోని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. బిజెపికి ఓటు వేస్తే, రిజర్వేషన్ల రద్దుకు తీర్పు ఇచ్చినట్లేనని, మత విద్వేషాలను ప్రోత్సహించినట్లేనని సీఎం దుయ్యబట్టారు.

Read Also : Jeevan Reddy: ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక క్రిమినల్ మైండ్ అధికారి:  జీవన్ రెడ్డి