Site icon HashtagU Telugu

Revanth Reddy : 111 జీవో రద్దుపై రేవంత్ రెడ్డి ఫైర్.. రియల్ ఎస్టేట్ మాఫియా అంటూ..

Revanth Reddy fires on KCR regarding 111 GO Scrapped

Revanth Reddy fires on KCR regarding 111 GO Scrapped

ఇటీవల తెలంగాణ(Telangana) క్యాబినెట్ 111 జీవోను రద్దు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్(Hyderabad) మహానగరానికి నీరు అందించే ఉస్మాన్ సాగర్(Usmaan Sagar), హిమాయత్ సాగర్ లను, ఆ చుట్టూ పక్కల ప్రదేశాలను కాపాడేందుకు, పొల్యూట్ అవ్వకుండా ఉండేందుకు 1996 లో అప్పటి ప్రభుత్వం 111 జీవో(GO) తెచ్చింది. దీంతో అక్కడి భూమిని వ్యవసాయానికి తప్ప ఇంకే రంగానికి ఉపయోగించకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 111 జీవో తీసేస్తాం అని గతంలోనే రాజకీయనాయకులు హామీలు ఇచ్చారు.

ఇన్నాళ్ల తర్వాత 111 జీవోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల ఆ ఏరియాలో ఉండే దాదాపు 84 గ్రామాలు ghmc పరిధిలోకి రానున్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకోనుంది. అయితే 111 జీవో రద్దుని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా TPCC చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) 111 జీవో రద్దుపై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. బండి సంజయ్ 111జీవో రద్దుపై రంకెలెయ్యడం కాదు. 111 జీవో రద్దుపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. 111జీవో రద్దు పై కాంగ్రెస్ పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తాం. కేసీఆర్ నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేల మంది చనిపోయే పరిస్థితి వస్తుంది. 111 జీవో పరిధిలో టీఆర్ఎస్ వాళ్ళు వందలాది ఎకరాల కొన్నారు. 111జీవో ప్రాంతంది తాగునీటి సమస్య కానే కాదు. బ్రిటిష్ రాజులు, నిజాం ప్రభువులు, సమైక్య పాలకులు హైదరాబాద్ ని డెవలప్ చేస్తూ వచ్చారు. బ్రిటిష్, నిజాం, సమైక్య పాలకులకన్నా కేసీఆర్ దుర్మార్గంగా పాలిస్తున్నారు. పరిపాలనపై పట్టులేని వ్యక్తి నిర్ణయాల వల్ల హైద్రాబాద్ ఆగం అవుతోంది. కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియాను తయారుచేసుకున్నాడు. 111 జీవో రద్దు అణువిస్పోటనం లాంటిది. హిరోషిమా, నాగసాకి లాగా హైదరాబాద్ ని తయారు చేస్తున్నారు. 111జీవో రద్దు వెనక ధనదాహం, అవినీతి, దోపిడీ ఉన్నాయి. 111 జీవో పరిధిలోని 80 శాతం భూములు కేసీఆర్ బినామీల చేతుల్లో ఉన్నాయి. పైపుల కంపెనీ కోసం 111 జీవో రద్దు చేస్తున్నారు. 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల స్కాం ఉంది. 111జీవో రద్దు ముమ్మాటికీ విధ్వంసమే. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ ఈ విధ్వంసానికి కారణం. హైదరాబాద్ చెరువులన్నీ మాయం అయ్యాయి. ఇప్పుడు నీళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి ఇల్లు కడుతున్నారు అంటూ దారుణ విమర్శలు చేశారు.

 

Also Read : Gadala Srinivasa Rao: ఆ ఎమ్మెల్యేకు విశ్రాంతినిద్దాం, డీహెచ్‌ వివాదస్పద విమర్శలు