Revanth Reddy : ‘కేసీఆర్ నువ్వో కచరా..నన్ను రేటెంతరెడ్డి అంటావా’ మెదక్ సభలో రేవంత్ ఫైర్

పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికి పోయాయో తెలియదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను అమలు చేయలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 08:39 PM IST

ఎన్నికల సమయం (Telangana Election Time) దగ్గర పడుతుండడం తో టీ కాంగ్రెస్ పార్టీ (Congress PArty) మరింత దూకుడు పెంచింది. శుక్రవారం 45 మందితో కూడిన సెకండ్ లిస్ట్ (Congress 2nd List) ను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీ..మరో పక్క బస్సు యాత్ర (Congress Bus yatra) తో అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ వస్తుంది. నేడు ఆదివారం కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర మెదక్‌ పట్టణంలోని రాందాస్ చౌరస్తాకు చేరుకుంది.

ఈ సభలో రేవంత్ (Revanth Speech) మాట్లాడుతూ..కేసీఆర్ ఫై విమర్శల వర్షం కురిపిస్తూనే..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పుకొచ్చారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికి పోయాయో తెలియదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను అమలు చేయలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. అందుకే తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ఆ హామీలు నెరవేరుస్తాం అని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి మల్కాజిగిరి ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించారు. మైనంపల్లి రోహిత్‌ను చూస్తోంటే ఇరవై ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది. రాబోయే ముప్పై ఏళ్లు రోహిత్ పేద ప్రజలకు సేవ చేస్తారని చెప్పుకొచ్చారు. అలాగే సీఎం కేసీఆర్ చేస్తున్న విమర్శలపై , ఆరోపణలపై రేవంత్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ నువ్వో కచరా..నన్ను రేటెంతరెడ్డి అంటావా అంటూ ఫైర్ అయ్యారు.

Read Also : Nagam Janardhan Reddy : నాగం తో కేటీఆర్ , హరీష్ రావు భేటీ..