Revanth Reddy:ఈ రోజు టీపీసీసీ (TPCC)ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ఎదుట మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..అమిత్ షా.. మోడీని మెప్పించడానికే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్త కేటీఆర్ అంటున్నారు. ఎయిర్ పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు మారుస్తాం అంటున్నారు. చెయ్ వేసి చూడు.. వీపు పగలకొట్టక పోతే పేరు మార్చుకుంట అని పేర్కొన్నారు.సెబీపై కేసీఆర్ విధానం ఏంటో ప్రజలకు చెప్పాలి.
We’re now on WhatsApp. Click to Join.
ఎడ్యుకేషన్. ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారు. బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ.పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ. సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ. సాంకేతిక విప్లవం తెచ్చారు రాజీవ్ గాంధీ. పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్ నుండి గాంధీ..వల్లభాయ్ పటేల్ బయలుదేరారు. అదే గుజరాత్ నుండి ..మోడీ.. అమిత్ షా లు బయలు దేరారు. ఆ ఇద్దరినీ చూస్తే దేశం గర్విస్తుంది.. ఈ ఇద్దరు దేశం సంపద లూటీ చేస్తున్నారని వెల్లడించారు.
కాగా, గౌతం అదాని మన దేశ సంపదను షేర్ మార్కెట్ ఎలా కొల్లగొడుతున్నారనే నిజాలను హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు” అని ఆరోపించారు. ఈ అంశంపై రాజ్యసభలో, లోక్ సభలో జాతీయ స్థాయిలో మల్లిఖార్జున ఖర్గె, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కొట్లాడుతున్నప్పటికీ.. కేంద్రం ఎవ్వరిని వినిపించుకునే పరిస్థితిలో లేదన్నారు. గౌతం అదాని అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటి వేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. కానీ అలా చేయడం ఇష్టం లేని ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజులు ముందుగానే సభను ముగించుకుని దేశం విడిచిపారిపోయారని మండిపడ్డారు. గౌతం అదాని అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేస్తోన్న పోరాటంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది అని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఇలా తాము ధర్నాకు దిగినట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Cristiano Ronaldo : రొనాల్డోకు ‘గోల్డెన్ ప్లే’ బటన్.. 12 గంటల్లోనే 1.30 కోట్ల సబ్‌స్క్రయిబర్లు