Demolition Man : రేవంత్ ‘కూల్చివేత మనిషి’ అంటూ BJP సెటైర్లు..

Demolition Man : రేవంత్ రెడ్డి వెనుకబడిన, పేద మరియు మధ్య తరగతి వర్గాల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కూల్చివేస్తున్నారని , అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉన్నత వర్గాలు, మిత్రపక్షం బిఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణాలు, అలాగే AIMIM నేతల అక్రమ ఫామ్ హౌస్లు వంటి పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది

Published By: HashtagU Telugu Desk
Demolition Man

Demolition Man

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూల్చివేతల పనితీరును విమర్శిస్తూ, తెలంగాణ BJP తన సోషల్ మీడియా వేదికల్లో “డెమోలిషన్ మ్యాన్” (Demolition Man) అంటూ సెటైర్లు వేస్తూ ఆరోపణలు చేసింది. రేవంత్ రెడ్డి వెనుకబడిన, పేద మరియు మధ్య తరగతి వర్గాల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కూల్చివేస్తున్నారని , అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉన్నత వర్గాలు, మిత్రపక్షం బిఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణాలు, అలాగే AIMIM నేతల అక్రమ ఫామ్ హౌస్లు వంటి పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది. ఈ వ్యాఖ్యలు హైడ్రా చేస్తున్న కొలిచివేతలను ఉదాహరణ గా చేసుకొని ఈ కామెంట్స్ చేసింది. మూసీ నది పునరుద్ధరణ పేరుతో హైడ్రా..కొద్దీ రోజులుగా కట్టడాలను కూల్చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూల్చివేతలపై సమస్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో బిజెపి , బిఆర్ఎస్ పార్టీలు హైడ్రా చేస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఇదే క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం రేవంత్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని , ఎన్నికల ప్రచార సమయంలో మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏవి? అంటూ ఆయన ప్రశ్నించారు. వరిధాన్యానికి బోనస్ విషయంలోనూ సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని నిబంధనలు పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని ఆయన అన్నారు . అప్పుడు YSR, KCR, ఇప్పుడు రేవంత్ పార్టీ ఫిరాయింపులు చేయిస్తున్నారన్నారు. ఫిరాయింపు MLAలపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పినా స్పీకర్ స్పందించడం లేదన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poisoning Incidents) లు జరిగి చిన్నారుల ప్రాణాలు పోతున్న కానీ CM రేవంత్ కనీసం దృష్టి పెట్టలేదని విమర్శించారు. గత 4-5 నెలలుగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారని …అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Read Also : Food Poisoning : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30 నుండి బీఆర్‌ఎస్‌ గురుకుల బాట: కేటీఆర్‌

  Last Updated: 27 Nov 2024, 08:07 PM IST