Site icon HashtagU Telugu

Rythu Bandhu : రైతుబంధు విడుదల ఫై పలు అనుమానాలు వ్యక్తం చేసిన రేవంత్

Rythu Bandhu

Rythu Bandhu

రైతు బంధు (Rythu Bandhu) సాయం విడుదలకు ఈసీ (EC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాకపోతే ఎన్నికలు ఈ నెల 30 న జరగనున్న నేపథ్యంలో .. ఈ నెల 29, 30 తేదీల్లో నిధులను విడుదల చేయవద్దని షరతు పెట్టింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) ఈ నెల 28 న విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతుబంధు విడుదల విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేసారు.

వాస్తవానికి రైతు బంధు విడుదల ఎప్పుడో జరగాల్సి ఉన్న..బిఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే నిధులు విడుదల చేయకుండా జాప్యం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది. కానీ బిఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీనే రైతు బంధు విడుదల చేయకుండా అడ్డు పడిందని..రైతు బంధు ఇచ్చి ఓట్లను తమ వైపుకు తిప్పుకోవాలని బిఆర్ఎస్ చూస్తుందని కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆరోపించింది. కానీ ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని..రైతులకు రైతు బంధు డబ్బు జమ చేయాలనీ మీము ఎప్పటి నుండో చెపుతున్నామని కానీ బిఆర్ఎస్ ప్రభుత్వమే కావాలనే జమ చేయకుండా నిర్లక్ష్యం చేసిందని అంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

కానీ ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రైతుబంధు నిధులను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. రైతులను ప్రభావితం చేసేలా పోలింగ్‌కు 4 రోజుల ముందు రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతివ్వడంపై రేవంత్‌రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు ముందుగానే విడుదల చేయాలని కాంగ్రెస్‌ కోరినా ఈసీ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు అనుమతి ఇవ్వడం వెనుక కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అని రుజువైందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పుడు రైతుబంధు నిధులు విడుదల చేయడం వల్ల రైతులకు 5 వేల రూపాయల నష్టం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. రైతుబంధు డబ్బులు అకౌంట్లో పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని సూచించారు. కాంగ్రెస్‌ వస్తే మరో 5 వేలు ఎక్కువ వచ్చేవి కదా? అని రైతులు బాధపడొద్దన్నారు. ఇప్పుడు కేసీఆర్‌ ఇచ్చే 5 వేలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక జనవరిలో ఇవ్వాల్సినవి ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Read Also : kandala Upender Reddy : పాలేరులో బెదిరింపులకు దిగుతున్న కందాల‌ ఉపేందర్ రెడ్డి