Site icon HashtagU Telugu

Revanth Reddy Cabinet Ministers : ఏ జిల్లా నుంచి ఎవరెవరు మంత్రులవుతున్నారంటే ..

Revanth Reddy Cabinet Minis

Revanth Reddy Cabinet Minis

మరికాసేపట్లో తెలంగాణ రెండో ముఖ్యమంత్రి (Telangana 2nd CM) గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబం నుండి తెలంగాణ విముక్తి చెందిందంటూ వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రేవంత్ తొలి కేబినెట్ (Cabinet Ministers) లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారి విషయానికి వస్తే..డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కకు స్థానం దక్కగా.. ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి, తుమ్ముల, నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి అవకాశం దక్కింది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే వరంగల్ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలైన సీతక్క, కొండా సురేఖలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి జూపల్లీకి స్థానం దక్కగా, ఉమ్మడి కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులకు చోటు కల్పించారు. మెదక్ నుంచి దామోదర రాజనర్సింహ, అలాగే ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి కి స్థానం దక్కింది. కాగా గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల నుంచి మొదటి లిస్ట్‌లో ఒక్కరికి కూడా స్థానం దక్కలేదు. ఓవరాల్ గా మొదటి కేబినెట్ లో అన్ని కులాల అభ్యర్థుల కు న్యాయం చేసారు. అలాగే సీనియర్ నేతలకు కూడా అవకాశం ఇచ్చి అందర్నీ సంతోష పరిచింది అధిష్టానం. రెండో కేబినెట్ లో ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారనేది చూడాలి.

ప్రస్తుతం సోనియా , రాహుల్ , ప్రియాంక గాంధీలు హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజ్ హోటల్ లో వీరు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికాసేపట్లో LB స్టేడియం కు చేరుకోనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలనా పరిస్థితి, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది.

Read Also : Panchayat Elections in Telangana : మళ్లీ తెలంగాణ లో ఎన్నికల హడావిడి