Site icon HashtagU Telugu

CM Revanth Reddy: సోనియా కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రేవంత్ దంపతులు

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది . ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా తనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల రాజకీయ నేతలు కూడా రేవంత్ సీఎం ప్రమాణ స్వీకారంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తిగా ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే రేవంత్ దంపతులు సోనియాగాంధీ కాళ్లకు మొక్కి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కూతురు, అల్లుడిని రేవంత్ సోనియాగాంధీకి పరిచయం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం 11 మంది మంత్రులతో తొలి జాబితాను రేవంత్డిప్రకటించారు. డిప్యూటీ సీఎం మరియు రెవెన్యూ శాఖను మల్లు భట్టి విక్రమార్కకు కేటాయించారు. హోంమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి చేపట్టారు.శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ. తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాల శాఖ, దామోదర రాజనర్సింహకు ఆరోగ్య శాఖ కేటాయించారు. పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమ శాఖ కేటాయించగా, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చారు. అలాగే కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికు పురపాలక శాఖ మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగించారు.

Also Read: Sridhar Babu Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు