తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు. లోకసభలో రూల్ నెంబర్ 377 ప్రకారం వర్గీకరణ అంశాన్ని లేవనెత్తిన రేవంత్ ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల కొన్ని ఉపకులాలకు నష్టపోతున్నాయని, విద్య ఉద్యోగ విషయాల్లో అసమానతలు ఏర్పడుతోందని వర్గీకరణ ద్వారానే ఈ సమస్య పరిష్కారమవుతోందని రేవంత్ తెలిపారు.
జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల్లోని 59 కులాల్లో 22 కులాల్లో ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి లేక అత్యంత వెనకబడ్డారని తేలిందని, వర్గీకరణ ద్వారానే ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు పొందని ఉప కులాలకు న్యాయం జరుగుతుందని రేవంత్ తెలిపారు. పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఎమ్మార్పీస్ నేతలు రేవంత్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు కట్టుబడి ఉందని రేవంత్ ప్రకటించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎమ్మార్పీఎస్ విద్యార్థి సదస్సులో సైతం రేవంత్ పాల్గొని వర్గీకరణకు మద్దతు తెలిపారు.